సాధారణంగా ఆత్మహత్య చేసుకునే వారికి చాలా బాధాకరమైన కారణాలు ఉంటాయి.కొందరు చదువులో రాణించలేదని, మరికొందరు పెళ్లి కాలేదని, అయినా విడిపోయామని ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు.
కానీ హైదరాబాద్‌లో ఓ 18 ఏళ్ల కుర్రాడిని బట్టతల పొట్టన పెట్టుకుంది.18 ఏళ్ల ఓ యువకుడు జేఈఈ పరీక్షలకు చదువుకుంటున్నాడు.
అతడి తండ్రి మాదాపూర్‌లోఉద్యోగం చేయగా వారంతా కొండాపూర్‌లో నివసిస్తున్నారు.పెద్దకొడుకు ఎంబీఏ చదువుతున్నాడు.
అయితే చిన్నబ్బాయికి అనారోగ్య కారణాలతో జుట్టు రాలిపోవడం మొదలైంది.దీంతో అతడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
కాగా ఇదే విషయం అతడి తల్లిదండ్రులకు కూడా చెప్పుకొచ్చాడు.అయితే ఇంత చిన్నవయసులోనే తనకు బట్టతల వస్తుందనే ఆవేదనతో అతడు బాత్రూమ్‌లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.ఇంత చిన్నవయసులో బట్టతల కారణంగా ఓ నిండు ప్రాణం పోవడం నిజంగా బాధాకరం అని స్థానికులు అంటున్నారు.
ఈ స్టార్ డైరెక్టర్ ఇక సక్సెస్ ఫుల్ సినిమాలను చేయలేడా..?