కొండా సురేఖపై నాగ్ కేసు నిలబడదు.. మంత్రి తరపు లాయర్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
తెలంగాణ మంత్రి కొండా సురేఖ( Minister Konda Surekha ) కొన్ని రోజుల క్రితం నాగార్జున కుటుంబం పరువుకు భంగం కలిగించేలా చేసిన కొన్ని కామెంట్లు సంచలనం అయ్యాయి.
నాగార్జున సురేఖ కామెంట్ల విషయంలో నాంపల్లి కోర్టును( Nampally Court ) ఆశ్రయించి పరువు నష్టం దావా దాఖలు చేశారు.
ఈరోజు నాగార్జున న్యాయస్థానం ఎదుట హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చారు.నాగార్జున తన వాంగ్మూలంలో భాగంగా మాట్లాడుతూ సురేఖ వ్యాఖ్యల వల్ల తమ పరువు మర్యాదలకు భంగం కలిగిందని తెలిపారు.
కొండా సురేఖ రాజకీయ దురుద్దేశంతో ఈ తరహా వ్యాఖ్యలు చేశారని ఆ వ్యాఖ్యలు ఛానెళ్లు, పత్రికల్లో వచ్చాయని నాగ్ అన్నారు.
కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు( Criminal Proceedings ) తీసుకోవాలని నాగ్ పేర్కొన్నారు.
2017లో నాగచైతన్య ,సమంత వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారని 2021లో వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయి ఇద్దరూ గౌరవప్రదంగా జీవిస్తున్నారని నాగ్ పేర్కొన్నారు.
"""/" /
దశాబ్దాలుగా పేరు ప్రఖ్యాతులను మా కుటుంబం కాపాడుకుంటూ వస్తోందని రాజకీయ దురుద్దేశంతో మా ఫ్యామిలీపై కొండా సురేఖ నిరాధార ఆరోపణలు చేశారని నాగ్ తెలిపారు.
క్రిమినల్ పరువు నష్టం కింద చర్యలు తీసుకోవాలని నాగ్ తరపున లాయర్ కోరారు.
అయితే మంత్రి తరపు లాయర్ మాట్లాడుతూ నాగ్ మంత్రిపై దాఖలు చేసిన కేసు నిలబడదని భావిస్తున్నామని చెప్పుకొచ్చారు.
"""/" /
ఈ కేసు విచారణలో ముగ్గురు వ్యక్తుల వాంగ్మూలాలలో తేడాలు ఉన్నాయని కోర్టు మంత్రికి లీగల్ నోటీసులు జారీ చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటామని మంత్రి తరపు లాయర్ అన్నారు.
కొండా సురేఖపై సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టుల విషయంలో బుధవారం డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని ఆమె తరపు లాయర్ వెల్లడించారు.
ఈ కేసుకు సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.
నాగార్జున ఈ కేసు విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు.
రాజమౌళి మహేష్ బాబు సినిమా మొదటి షెడ్యూల్ జరిగేది అక్కడేనా..?