నిజాం పాలనపై నిప్పులు చెరిగిన వీరుడు కొండ లక్ష్మణ్ బాపూజీ

రాజన్న సిరిసిల్ల జిల్లా: నిజాం పాలనపై నిప్పులు చేరిన వీరుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు వనం బొందయ్య అన్నారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం స్థానిక మార్కండేయ ఆలయంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి కొండా లక్ష్మణ్ బాపూజీ అని భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాటం చేసిన మహానుభావుడని కొనియాడారు.

నిజాం వ్యతిరేక పాలన ఉద్యమాలు చేసిండని నైజాం పద్మశాలి సేవా సంస్థను స్థాపించి ఉద్యమాన్ని ప్రారంభించిన మహనీయుడని పేర్కొన్నారు.

తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో గోశిక దేవదాస్, డాక్టర్ వనం ఎల్లయ్య, పోతు ఆంజనేయులు, శ్రీరామ్ సుదర్శన్,దోమల భాస్కర్, మ్యాన రంగయ్య, వనం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

పుష్ప ది రూల్ సక్సెస్ క్రెడిట్ సుకుమార్ రెడ్డిదే.. వైరల్ అవుతున్న బన్నీ కామెంట్స్!