రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించింది కొండా లక్ష్మణ్ బాపూజీ
TeluguStop.com
మాజీ జెడ్ పి టి సి సభ్యులు ఏలూరి రాజయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా తొలి, మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించింది కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎల్లారెడ్డిపేట మండల జెడ్పిటిసి సభ్యులు ఏలూరి రాజయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి లు కొనియాడారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్యాగధనుడు కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగు,బలహీన వర్గాల కోసం తపించిన వ్యక్తి అని అన్నారు.
1969లో తన మంత్రి పదవిని సైతం వదులుకున్న త్యాగధనుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు.
శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు.ఎమ్మెల్యేగా, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేయటంతో పాటు నిరంతరం బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి బాపూజీ తపించారన్నారు.
కాగా, కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఈ నెల 27న అధికారికంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినందుకు వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్ని బాబు, నాయకులు మెండే శ్రీనివాస్ యాదవ్ , కోనేటి శ్రీనివాస్, మర్తన్నపేట లక్ష్మణ్ గౌడ్, సింగారం మహబూబ్,దుంపెన రమేష్, ఉప్పుల సత్తయ్య తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
పెళ్లి కూతురు ముందే వరుడి చెవిలో గుసగుసలాడిన ఫ్రెండ్.. చివరకు?