కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్న కొండా దేవయ్య , గంగుల కమలాకర్

కొండా దేవయ్య, తెలంగాణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు.రవిచంద్ర కు రాజ్యసభ ఇచ్చినందుకు మున్నూరు కాపు సంఘం తరపున నమస్కారాలు తెలియజేస్తున్నా.

ముప్పయి మూడు జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది.కేసీఆర్, కెటిఆర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

గంగుల కమలాకర్, మంత్రి :సీఎం కేసీఆర్ ప్రతి సందర్భంలో తాను పెద్ద కాపు అని చెప్తుంటారు.

మా కులానికి పెద్దదిక్కుగా ఉన్న రవి చంద్రకు రాజ్య సభ అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు.

బీసీల్లో మెజార్టీ గా మున్నురు కాపులను ఆర్థికంగా ముందుకు తీసుకు వెళ్ళిన వ్యక్తి కేసీఆర్.

హైద్రాబాద్ మేయర్ గా రెండుసార్లు మా కులస్తులకు అవకాశం ఇచ్చిన గొప్ప వ్యక్తి మాకులం అంతా చాలా సంతోషం ఉంది మంత్రులుగా, ఎమ్మేల్యేలుగా, కార్పొరేషన్ చైర్మన్లు గా మా కులానికి అవకాశం ఇచ్చారు.

ఇంత పెద్ద అవకాశాలు ఏ పార్టీ ఇవ్వలేదు.మా కులమంతా ఎప్పటికీ కేసీఆర్ కు రుణపడి ఉంటుంది.

మా కులాన్ని రాజకీయంగా, సామాజికంగా ముందుకు తీసుకు వెళ్ళిన వ్యక్తి కేసీఆర్.

బిచ్చగాడి రోల్ గురించి ధనుష్ కు చెప్పడానికి అలా ఫీలయ్యా.. శేఖర్ కమ్ముల ఏమన్నారంటే?