ఒలింపిక్ విన్నర్ బయోపిక్‌తో వస్తున్న కోన

ఇటీవల కాలంలో బయోపిక్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది.సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన మహానటి చిత్రం ఎలాంటి సెన్సేషనల్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

ఆ తరువాత వరుసగా తెలుగులో బయోపిక్ చిత్రాలు సందడి చేశాయి.కాగా మరో బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఒలింపిక్ క్రీడాకారిణిగా భారతదేశ ఖ్యాతిని చాటిన ప్రపంచ ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి జీవితగాధను బయోపిక్ రూపంలో తెరకెక్కించేందుకు ప్రముఖ నిర్మాత కోన వెంకట్ సిద్ధమవుతున్నాడు.

దీనికి సంబంధించిన హక్కులను ఆయన సొంతం కూడా చేసుకున్నాడట.శ్రీకాకుళంలోని ఆముదాలవలసకు చెందిన మల్లీశ్వరి జీవితగాధను చిత్రంగా తెరకెక్కిస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ఆయన ఈ సినిమాను తెరకెక్కించ సత్తా ఉన్న దర్శకుడి కోసం అన్వేషిస్తున్నాడు.

టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన పలువురు డైరెక్టర్లను ఆయన ఈ విషయంపై సంప్రదిస్తున్నారట.మరి ఈ బయోపిక్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎవరు కొట్టేస్తారో చూడాలి.