బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా

బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు.ఈ క్రమంలో ఆయన మళ్లీ సొంత గూటికే చేరనున్నారు.

ఈ మేరకు ఈనెల 27న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో చేరనున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.

సీఎం కేసీఆర్ ను గద్దె దించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.మరో ఐదు వారాల్లో కేసీఆర్ పాలన అంతం కాబోతుందన్నారు.

బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం అనుకుని అందులో చేరానన్న కోమటిరెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా మారడంతో పార్టీ మారుతున్నట్లు తెలిపారు.

అయితే గతంలో కాంగ్రెస్ కు రాజీనామా చేసిన బీజేపీలో చేరిన కోమటిరెడ్డి మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరనున్నారు.

కాగా వచ్చే ఎన్నికల్లో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీయార్ మిస్ చేసుకున్న ఆ సూపర్ హిట్ సినిమా ఏంటో తెలుసా..?