మళ్లీ కాంగ్రెస్ గూటికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..!
TeluguStop.com
సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరనున్నారని తెలుస్తోంది.
ఈ మేరకు ఢిల్లీ వెళ్లనున్న ఆయన అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం పార్టీలో చేరే అవకాశం ఉంది.
ఈ క్రమంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది.
బీజేపీలో అసంతృప్త నేతగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తొలి జాబితాలో చోటు దక్కలేదు.
దీంతో ఆయన పార్టీని వీడనున్నారని తెలుస్తోంది.కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి గత ఏడాది కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
దీంతో మునుగోడులో ఉపఎన్నిక జరగగా కోమటిరెడ్డి గెలుపు సాధించలేకపోయారు.ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా బీజేపీపై అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీ కార్యాకలాపాలకు సైతంగా దూరంగా ఉంటున్నారు.
ఈ క్రమంలోనే ఆయన మళ్లీ సొంత గూటికే చేరే అవకాశాలు కన్పిస్తున్నాయని వార్తలు జోరుగా సాగుతున్నాయి.
Blackjack Variants & All Blacks Betting: A Practical Guide For NZ Punters