చాలాకాలం తర్వాత గాంధీభవన్ కి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..!!
TeluguStop.com
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయకుండా చాలా మౌనంగా.తటస్థంగా వ్యవహరించారు.
విదేశాలకు కూడా వెళ్లిపోవడం జరిగింది.ఈ క్రమంలో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నట్లు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే చాలాకాలం తర్వాత పార్టీకి దూరంగా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు గాంధీభవన్ కి రావడం జరిగింది.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.ఇద్దరూ కూడా చాలాసేపు పార్టీ బలోపేతంపై చర్చించుకోవడం జరిగింది.
దీంతో కాంగ్రెస్ పార్టీలో వివాదాలు టీ కప్పులో తుఫాను వంటివి అని మరోసారి రుజువు అయింది.
చాలాకాలం తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి.గాంధీభవన్ లో ఎంట్రీ ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ వార్త సంచలనంగా మారింది.