ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో కోమటిరెడ్డి భేటీ

ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు.

రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కోమటిరెడ్డి పోటీ చేసే స్థానాలపై చర్చించారని తెలుస్తోంది.

ఈ మేరకు మునుగోడుతో పాటు గజ్వేల్ నియోజకవర్గంలోనూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

కేసీఆర్ ను గద్దె దించడమే తన లక్ష్యమంటున్న కోమటిరెడ్డి పార్టీ అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్ పై గజ్వేల్ స్థానంలో సైతం బరిలో దిగుతానని ఇప్పటికే తెలిపారు.

కాగా తాజాగా బీజేపీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేపు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారన్న సంగతి తెలిసిందే.

ఈ న్యాచురల్ సీరంను వాడితే హెయిర్ ఫాల్ తో పాటు చుండ్రు కూడా పరార్ అవుతుంది!