కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అయ్యేది ఎవరంటే? కోమటిరెడ్డి కామెంట్స్
TeluguStop.com
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో మనం ప్రత్యేకంగా చర్చించుకోనక్కరలేదు.తెలంగాణ ఇచ్చిన పేరున్నా దాన్ని రాజకీయంగా మలుచుకోవడంలో విఫలమయ్యారు.
అందుకే ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించలేకపోయారు.
ప్రజల సమస్యలపై పోరాటం చేయడంలో నిర్లక్ష్యం ఒక కారణం కాగా, కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కాంగ్రెస్ ను ప్రజల్లో పలుచన చేశాయనే చెప్పవచ్చు.
కాంగ్రెస్ నాయకులలో గ్రూపు రాజకీయాల వల్ల ఏ నాయకుడిని ఎదగనీయకుండా అధిష్టానం వద్ద ఒత్తిడి తెచ్చి ఆ నాయకుడికి చెక్ పెట్టే వరకు వదిలి పెట్టరు.
అంతలా కాంగ్రెస్ నాయకులు తమ అనుభవాన్ని ఉపయోగిస్తుంటారు.ఇక అసలు విషయంలోకి వస్తే ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారాయి.
కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థులకు కొదవలేదు.ఎవరిని కదిలించినా సీఎం అభ్యర్థిగా నేను అర్హుడినే అని ప్రకటించే నేతలు డజను మంది నేతలు ఉంటారు.
కాని ఎంపీ కోమటిరెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జానరెడ్డి సీఎం అవుతాడని నాగార్జున సాగర్ ఎన్నికల్లో ప్రచారం సందర్బంగా పై వ్యాఖ్యలు చేశారు.
అసలే వర్గ పోరుతో సతమతమతున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కోమటిరెడ్డి వ్యాఖ్యలతో కొందరు నేతలలో అలక మొదలైందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చే అవకాశం లేకున్నా నేతల్లో గ్యాప్ ను పెంచడానికి ఇటువంటి వ్యాఖ్యలే కారణమవుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వైరల్ వీడియో: పందెకోసం తయారు చేసిన కోడి చివరకు ఎక్కడికి చేరిందంటే?