టీడీపీ లోకి కొలుసు పార్థసారధి ? ఆయన వెంట ఈ ఇద్దరు ?

సీనియర్ పొలిటిషన్, వైసీపీలో కీలక నేతగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి, పెనుమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి( Kolusu Parthasarathy ) టిడిపిలో చేరేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత, తనకు మంత్రి పదవి ఖాయం అని కొలుసు పార్థసారథి చాలానే ఆశలు పెట్టుకున్నారు.

మొదటి విడతలో తన సామాజిక వర్గమైన యాదవ కులానికి చెందిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ కు మంత్రి పదవి దక్కడం తో, రెండో విడతలో మంత్రి పదవి ఖాయమని పార్థసారథి అంచనా వేశారు.

అయితే అనూహ్యంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు జగన్ మంత్రి పదవి కట్టపెట్టారు.

ఇక అప్పటి నుంచి పార్థసారథి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.సీనియార్టీని, సిన్సియారిటీని పట్టించుకోకుండా జగన్ వ్యవహరిస్తున్నారనే అసంతృప్తితో ఉంటున్నారు.

దీంతోపాటు ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పెనమలూరు నియోజకవర్గాన్ని మంత్రి జోగి రమేష్ కు కేటాయించడం వంటివి పార్థసారధికి మరింత అసంతృప్తిని కలిగిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఈనెల 21న టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు పార్థసారథి సిద్ధమయ్యారట.

"""/" / ఆయనతోపాటు వైసీపీ ఎమ్మెల్యే ఒకరు, ఎమ్మెల్సీ ఒకరు టిడిపి కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తన వెంట వీలైనంత ఎక్కువ మందిని టీడీపీ లోకి తీసుకువెళ్లాలని పార్థసారథి భావిస్తున్నారట.

ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పార్థసారధి( Janga Krishnamurthi )ని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వైసిపి ఆవిర్భావం నుంచి జంగా కృష్ణమూర్తి పార్టీ కోసం కష్టపడుతున్నారు.ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తానని గతంలో జగన్ హామీ ఇచ్చారు.

కానీ అది అమలు చేయలేదు.అలాగే టిటిడి చైర్మన్ గా కూడా కృష్ణమూర్తి పేరు వినిపించింది.

రాజ్యసభ సీటు కేటాయిస్తారని ప్రచారం సైతం జరిగింది.కానీ కేవలం ఎమ్మెల్సీ మాత్రమే జగన్ ఇవ్వడంతో కృష్ణమూర్తి అసంతృప్తితోనే ఉంటున్నారు.

"""/" / అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో తనకు గురజాల ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరినా, ఆయన నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో, అసంతృప్తితో పార్థసారధి వెంట టిడిపిలో చేరాలనే ఆలోచనతో ఆయన ఉన్నారట.

అలాగే ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజ ( Eliza )సైతం పార్థసారథి తో భేటీ కావడంతో ఆయన కూడా టిడిపిలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

దీంతో పార్థసారథి వెంట టిడిపిలో చేరేందుకు ఎవరెవరు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారనేదానిపై వైసీపీ అధిష్టానం ఆరా తీస్తోందట.

వేణు శ్రీరామ్ పరిస్థితి ఏంటి..?ఆయన ఎందుకు భారీ సక్సెస్ ను కొట్టలేకపోతున్నాడు..?