చిన్నారి చికిత్స నిమిత్తం 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన మహబూబ్ నగర్ జిల్లా సైనికులు కొలుమూల దామోదర్ స్వర్ణలతా ఫౌండేషన్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా:నిరుపేద కుటుంబానికి చికిత్స నిమిత్తం 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి మహబూబ్ నగర్ జిల్లా సైనికులు మరియు కొలుముల దామోదర్ స్వర్ణలత ఫౌండేషన్ పెద్ద పెళ్లి వారు అందించారు వివరాల్లోకి వెళ్తేరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ద్యావ శ్రీకాంత్ రెడ్డి రేవతి ల కుమారుడు, రుద్రాన్ష్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగాలేక హైదరాబాదులోని రెయిన్బో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నడు ఆపరేషన్ కు సరిపడా డబ్బులు లేక వారి ఆర్థిక స్థితి అంతంత మాత్రంగానే ఉన్నది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం దాతల ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తూ వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేసుకోవడంతొ వాట్సప్ గ్రూప్ లో ఇట్టి విషయాన్ని చూసిన ఆర్మీ హవల్దార్ నిమ్మతుల అమరేందర్ రెడ్డి, రాచర్ల గొల్లపల్లి వాస్తవ్యుడు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు ఇట్టి విషయాన్ని వారి తోటి సైనికులతో చదువుకున్న మిత్రులతో వాట్సాప్ లో మరియు ఫోన్ ద్వారా షేర్ చేసుకున్నాడు తన మిత్రుడు దామోదర్ స్వర్ణలత ఫౌండేషన్ పెద్దపల్లి వారు కెనడాలో, స్థిరపడ్డారు వారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి,చెందినవారు దామోదర్ స్వర్ణలత , వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగింది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాసైనికులు దేశంలో వివిధ ప్రదేశాలలో విధులు నిర్వహిస్తున్న సైనికులు వారి దయా హృదయంతో 20వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగినది మానవతా దయా హృదయంతో ఆర్థిక సహాయం అందించిన కొలుముల స్వర్ణలత దామోదర్, ఫౌండేషన్ పెద్దపల్లి వారికి మహబూబ్ నగర్ జిల్లా సైనికులకు గొల్లపల్లి గ్రామం తరపున మరియు చికిత్స పొందుతున్న బాలుడి తండ్రి శ్రీకాంత్ రెడ్డి, కుటుంబం తరపున, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ పాశం సరోజన దేవ రెడ్డి, ఎంపీటీసీ ల్యగల శ్రీనివాస్ రెడ్డి, రాచర్ల బొప్పాపూర్ తిక్కయ్య గారి సత్తిరెడ్డి, బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండా రమేష్ గౌడ్, విద్యా కమిటీచైర్మన్ గోగురి శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెంజర్ల నారాయణ యాదవ్, బోయిని మహదేవ్ మాజీ సైనికుడు, శాతాన్ని ప్రవీణ్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా రిపోర్టర్ మా రేపు భూశంకర్, ఇట్టి సేవా కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
నిరుపేద కుటుంబాన్నిఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఆదుకోవాలని వారి కుటుంబం వేడుకుంటున్నారు.
ప్రభాస్ కథల సెలక్షన్ లో భారీ మార్పు వచ్చిందా..?