విజయ్ రెమ్యున్ రేషన్ అన్ని కోట్లా..?

కోలీవుడ్ స్టార్ హీరోల్లో విజయ్( Thalapathy Vijay ) ఒకరు.రజినీకాంత్ తర్వాత తమిళం లో అంత పేరు సంపాదించుకున్న ఒకే ఒక హీరో విజయ్.

ఈయన మార్కెట్ ను మించి పారితోషికం తీసుకుంటూ ఈ స్టార్ హీరో వార్తల్లో నిలుస్తున్నారు.

సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ ను తీసుకుంటున్న విజయ్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తర్వాత సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాకు విజయ్ పారితోషికం 150 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.సాధారణంగా పాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపు ఉన్న హీరోలు మాత్రమే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేయడం గమనార్హం.

అయితే విజయ్ కు కోలీవుడ్( Kollywood ) లో మాత్రమే క్రేజ్ ఉన్నా ఈ స్థాయిలో పారితోషికాన్ని విజయ్ అందుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.

విజయ్ సినిమాలకు నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా ఊహించని స్థాయిలో ఆదాయం చేకూరుతోందని సమాచారం అందుతోంది.

ఈ రీజన్ వల్లే ఆయన అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం అంగీకరిస్తున్నారు.

విజయ్ టాలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నా సరైన కథ దొరకకపోవడం వల్ల సమస్య వస్తోందని తెలుస్తోంది.

"""/" / టాలీవుడ్ డైరెక్టర్లతో పని చేస్తే తెలుగులో కూడా మార్కెట్ పెరుగుతుందని విజయ్ భావిస్తున్నారు.

విజయ్ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది.కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం విజయ్ నంబర్ వన్ హీరోగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

విజయ్ కెరీర్ పరంగా ఎదగడంతో పాటు మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

"""/" / ఏడాది వారసుడు సినిమాతో( Varasudu )విజయ్ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.

మల్టీస్టారర్ సినిమాలలో నటించే అవకాశం వస్తున్నా విజయ్ ఆ సినిమాలకు నో చెబుతున్నారని తెలుస్తోంది.

విజయ్ పాన్ ఇండియా హీరోగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలు పూర్తిస్థాయిలో వర్కౌట్ కావడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.