ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సూర్య కంగువ.. అన్ని రూ.కోట్లు పెట్టి కొనుగోలు చేశారా?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య( Surya ) తాజాగా నటించిన చిత్రం కంగువ.

( Kanguva ) సూర్య కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి.

ఈ మూవీని పీరియాడికల్ యాక్షన్‌ డ్రామాగా శివ డైరెక్షన్‌లో తెరకెక్కించారు.అభిమానుల భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది.

దాదాపు రూ.350 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.

మొదటి షో నుంచే కంగువకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

"""/" / ఇప్పటికే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తోంది.

ఆ సంగతి పక్కన పెడితే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌కు సంబంధించి ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది.

కంగువా ఓటీటీ రైట్స్‌ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్( Amazon Prime ) దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

దాదాపు రూ.100 కోట్లకు ఓటీటీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.

మామూలుగా సినిమా విడుదలైన తర్వాత నెల రోజులకు ఓటీటీ వచ్చేస్తున్నాయి.కానీ కంగువా లాంటి భారీ బడ్జెట్ చిత్రాలకు మరింత సమయం పడుతుంది.

"""/" / తాజా ఒప్పందం ప్రకారం విడుదలైన ఆరు వారాల తర్వాతే ఓటీటీకి రానుందని సమాచారం.

అంటే ఈ ఏడాది డిసెంబర్ చివర్లో ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

ఇకపోతే ఈ సినిమాకు గాను సూర్య దాదాపు రూ.39 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం థియేటర్లో సక్సెస్ఫుల్గా ప్రదర్శితం అవుతున్న ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.

ఆ సినిమాకు మహేష్ బాబు జీరో రెమ్యునరేషన్.. రూట్ మార్చి మంచి పని చేశారా?