మార్కెట్ 10 కోట్లు రెమ్యునరేషన్ 30 కోట్లు.. ఈ హీరో రాంగ్ రూట్ లో వెళుతున్నాడా?

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల బడ్జెట్లు అంచనాలకు మించి పెరిగిపోతూ ఉండటం విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పెరిగిన బడ్జెట్ల వల్ల హిట్ టాక్ వచ్చిన సినిమాలు సైతం బ్రేక్ ఈవెన్ కావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమాలు సైతం కొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కావడానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

కోలీవుడ్ ఇండస్ట్రీలో( Kollywood ) కొరియోగ్రాఫర్, డైరెక్టర్, హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న ఒక నటుడి థియేట్రికల్ మార్కెట్ 10 కోట్ల రూపాయలుగా ఉండగా ఈ నటుడి రెమ్యునరేషన్( Remuneration ) మాత్రం 30 కోట్ల రూపాయలుగా ఉందని సమాచారం అందుతోంది.

ఈ హీరో( Hero ) గత సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కి ఆ సినిమా నిర్మాతలను( Producers ) ముంచేసింది.

మార్కెట్ తో సంబంధం లేకుండా ఆ హీరో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. """/" / ఏ భాషకు చెందిన హీరోలు అయినా నిర్మాతలకు నష్టం కలిగే విధంగా వ్యవహరించడం ఏ మాత్రం మంచిది కాదని చెప్పవచ్చు.

మార్కెట్ ను మించి హీరోలు రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం ఏంటని నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఆ హీరో ఇకనైనా రెమ్యునరేషన్ విషయంలో తగ్గితే బాగుంటుంది.ప్రస్తుతం నాన్ థియేట్రికల్ రైట్స్ పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు.

"""/" / ఈ హీరోకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది.ఈ హీరో తాను చేసిన సేవా కార్యక్రమాల ద్వారా ప్రశంసలు అందుకున్నారు.

ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఒక సినిమా సక్సెస్ సాధిస్తే అడ్డూఅదుపు లేకుండా రెమ్యునరేషన్ ను పెంచుతున్నారు.

ఈ పరిస్థితి మారకపోతే భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీ ప్రమాదంలో పడే ఛాన్స్ అయితే ఉంది.

నిర్మాతలు సైతం డిమాండ్ ఉన్న హీరోలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని చెప్పవచ్చు.

రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మారుతుందేమో చూడాలి.

రూ.580కే హెర్మేస్ హ్యాండ్‌బ్యాగ్‌ కొన్న యువతి.. కానీ నెక్స్ట్ డే రిటర్న్ ఇచ్చేసింది..?