కోలీవుడ్ డేంజర్ జోన్ లో ఉందా... ఫ్యూచర్ ఏంటి?
TeluguStop.com
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ప్రస్తుతం ముందుగా వినిపిస్తున్నది టాలీవుడ్.మేం కూడా ఏమి తక్కువ కాదంటూ శాండిల్ వుడ్ కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో తన తడాఖా చూపించింది.
రెండే రెండు సినిమాలు అందులోనూ సీక్వెల్స్ తో ఒక్క సారిగా రెస్ లో ముందుకొచ్చింది.
ఇక ఆ తర్వాత బాలీవుడ్ ఉండనే.ఉంది ఇలా అన్ని అయ్యాక ఎక్కడో మూలన కోలీవుడ్ పేరు వినిపిస్తోంది.
ఒకప్పుడు కోలీవుడ్ అంటే స్వచ్ఛమైన చిత్రాలకు పెట్టింది పేరు.కానీ ఇపుడు ట్రెండ్ ప్రకారం ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు.
కథలోనే కాదు తెరపై కనిపించే సన్నివేశాల్లో సస్పెన్స్, ఆశ్చర్యకరమైన, అద్భుతమైన అబ్బుర పరిచే అంశాలను చూడాలనుకుంటున్నారు.
అయితే ఆ రేంజ్ లో సినిమా కావాలి అంతే బడ్జెట్ సరిపోదు అంటున్నారు తమిళ డైరెక్టర్స్.
భారీ బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు రెడీ.కానీ ఆ బడ్జెట్ లో బాదుడు భాగం తీసుకునేందుకు హీరోలు, ఆర్టిస్టులు కూడా రెడీ అందుకే మిగిలిన దాంతో సినిమా తీస్తే ఇక క్వాలిటీ ఔట్ పుట్ ఏమొస్తుంది.
కొత్తదనాన్ని కోరుకునే ఆడియన్స్ కి ఎలా నచ్చుతుంది అంటున్నారు కొందరు కోలీవుడ్ ప్రముఖులు.
ఇటీవలే తమిళ టాప్ దర్శకులలో ఒకరైన భారతీరాజా సైతం ఇదే విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దపీట టాలీవుడ్ దే కోలీవుడ్ తమిళ సినిమాల కంటే తెలుగు చిత్రాలే బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంటూ అగ్రస్థానాన్ని అందుకుంటున్నాయి అని చెప్పుకొచ్చారు.
410 కోట్లతో సినిమాని నిర్మిస్తే అందులో 10 కోట్లే కథకు ఖర్చుపెట్టి మిగిలినదంతా నటులు తమ కోసమే ఖర్చు పెట్టిస్తున్నారని, అందుకే తమిళ సినిమా నశించిపోతోంది అని ఆవేదన వ్యక్తం చేస్తూ తమిళ నటుల పై విమర్సలు గుప్పించారు.
"""/" /
ఇటు తమిళ ఇండస్ట్రీపై కామెంట్లు కూడా అంతే దారుణంగా వినపడుతున్నాయి.
స్టార్ హీరోనా సినిమా ఎలా తీసిన హిట్ అవుతుంది అని చంకలు గుద్దుకుంటే మొదటికే మోసం వస్తుంది అని అంటున్నారు.
దానికి తోడు పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయిన తమిళ మూవీ బీస్ట్ కూడా అందుకు తగ్గట్టే బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడింది.
సింగిల్ టికెట్స్ కూడా లేకపోవడంతో కొన్ని చోట్ల సినిమాని ఎత్తేశారు కూడా, దాదాపు అన్ని చోట్ల కలెక్షన్లు నామ మాత్రంగా కూడా లేవు.
అంతెందుకు సొంత భాష తమిళంలోనే కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి.ఇకనైనా మార్పు రాకపోతే దర్శకుడు భారతి రాజా అన్నట్లు తమిళ ఇండస్ట్రీ పూర్తిగా నశించిపోతుంది ఏమో అంటున్నారు.
వారం రోజుల్లో 2 డబుల్ సెంచరీలు.. టీమిండియా సెలక్షన్ కమిటీకి సంకేతాలు ఇస్తున్నాడుగా?