Actor Appukutty : నేను కూడా రైతునే.. పొలం పనులు అన్నీ వచ్చు.. కోలీవుడ్ హీరో అప్పుకుట్టి కామెంట్స్ వైరల్!
TeluguStop.com
కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా, కమెడియన్ గా అప్పుకుట్టి( Appukutty ) తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.
అప్పుకుట్టి యాక్టింగ్ స్కిల్స్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.ప్రస్తుతం ఒక సినిమాలో రైతు పాత్రలో( Farmer ) నటిస్తున్న అప్పుకుట్టి తాను రైతు కుటుంబానికి చెందిన వ్యక్తినని చెబుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
అప్పుకుట్టి రైతు పాత్రకు సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.కొన్ని సినిమాలలో హీరోగా కొన్ని సినిమాలలో కమెడియన్ గా నటించిన అప్పుకుట్టి తన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రశంసలతో పాటు విజయాలను సైతం అందుకుంటున్నారు.
అళ్ గర్ సామియిన్ కుదిరై సినిమాలో అప్పుకుట్టి హీరోగా నటించారు.ఈ సినిమాలో అప్పుకుట్టి యాక్టింగ్ స్కిల్స్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్( National Best Actor Award ) వచ్చింది.
శింబు హీరోగా తెరకెక్కిన వెందు తనిందదుక్కాడు సినిమాలో అప్పుకుట్టి కీలక పాత్రలో నటించారు.
"""/" /
ప్రస్తుతం అప్పుకుట్టి వాళ్గ వివసాయి, పిరందనాళ్ వాళ్తుగల్ సినిమాలతో బిజీగా ఉన్నారు.
వాళ్గ వివసాయి( Valga Vivasayi ) సినిమాలో రైతు రోల్ పోషిస్తున్న అప్పుకుట్టి ఈ సినిమాతో మరో జాతీయ అవార్డ్ ను అందుకునే ఛాన్స్ అయితే ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
అప్పుకుట్టి మాట్లాడుతూ నేను కూడా రైతునేనని తెలిపారు.పొలానికి సంబంధించిన అన్ని పనులు వచ్చని కామెంట్లు చేశారు.
"""/" /
పొలం దున్నడం, విత్తడం, ఎరువులు వేయడం, నీళ్లు పెట్టడం అన్నీ నాకు తెలుసని అప్పుకుట్టి కామెంట్లు చేశారు.
రజనీకాంత్( Rajinikanth ) సినిమాలో నటించాలని కోరుకుంటున్నానని అప్పుకుట్టి వెల్లడించారు.అప్పుకుట్టి కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించి మరిన్ని విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
అప్పుకుట్టి రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగానే ఉందని తెలుస్తోంది.ఇతర భాషల్లోని సినిమాలలో సైతం హీరో అప్పుకుట్టి నటించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
భారతదేశంపై చైనీయుడు ఊహించని కామెంట్స్.. “ఇదో మిస్టరీ ప్లేస్” అంటూ..