కోలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు ఎవ్వరు అయినా కూడా మన తెలుగు లో విడుదల చేయాల్సిందే !
TeluguStop.com
దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా ప్రస్తుతం ఒకే రకమైన పరిస్థితి కొనసాగుతుంది.అంతటా వరుస ఫ్లాపులు వాస్తు సదరు భాషల హీరోలను వెంటాడుతున్నాయి.
అందరి లెక్క ఒకటైతే మన టాలీవుడ్ లో పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది.
ఇక్కడ వస్తున్న అన్ని తెలుగు సినిమాలు దాదాపు హిట్ అవుతన్నాయి.అంతే కాదు టాలీవుడ్ లో ప్రస్తుతం చాలా ఎక్కువగా పరాయి భాషల సినిమాలు వస్తూ అవి కూడా హిట్ అవుతున్నాయి.
మన తెలుగు సినిమాలు కేవలం మన తెలుగులో మాత్రమే కాదు పాన్ ఇండియా వ్యాప్తంగా కూడా హిట్ అవుతుండడం విశేషం.
అందుకే హీరో విక్రమ్ ఒక మాట అన్నారు మన తెలుగు సినిమా వాళ్ళు పిచ్చోళ్ళు అని.
ఎందుకంటే వారికి భాషతో సంబంధం లేదు.కేవలం కంటెంట్ ఉంటే వారు సినిమాను ఆదరిస్తున్నారు.
అందుకే పరాయి బాష సినిమాలు మన టాలీవుడ్ లో ఎక్కువగా విడుదలవుతున్నాయి.అందుకే పక్క బాషాల హీరోలు తమ సినిమాపై నమ్మకం ఉన్నా లేకపోయినా తెలుగు ప్రేక్షకులను టార్గెట్ గా పెట్టుకునే సినిమాలు విడుదల చేస్తున్నారు.
ఇటీవల విడుదలైన బ్రహ్మాస్త్రం సినిమా యావత్ భారత్ దేశంలో యావరేజ్ టాక్ తో నడిచిన మన తెలుపు వాళ్ళు ఆ చిత్రానికి బ్రహ్మరథం పెట్టారు.
అంతేకాదు కమల్ హాసన్ ఎన్నో ఏళ్లుగా ఫ్లాపులతో సతమతమవుతూ వస్తున్నాడు.అతడి విక్రమ్ సినిమాని కూడా తెలుగు వాళ్ళు ఎంతగానో ఆదరించి విజయాన్ని చేకూర్చారు.
ఇక సీతారామం ఎంత పెద్ద హిట్ చేశారో మనందరికీ తెలుసు.ఇక ముందు ముందు కూడా అనేక భాషల సినిమాలు మన తెలుగు పై దండయాత్ర చేసే అవకాశం ఉన్నాయి.
"""/"/
వారి సినిమాల ప్రమోషన్స్ ఇక్కడ చేస్తూ తెలుగులో హడావిడి చేసి హైప్ క్రియేట్ చేస్తున్నారు.
ఏ భాష అయినా సరే తెలుగులో విడుదల చేయాలని ఖచ్చితంగా హీరోల కండిషన్ గా కనిపిస్తుంది.
తమిళ, మలయాళ, హిందీ సినిమాలన్నీ కూడా తెలుగు ప్రేక్షకులు తెగ చూస్తున్నారు.సినిమా బాగుంటే చాలు అది భాష ఏదైనా సరే హిట్టు కొట్టడానికి గ్యారెంటీ అన్నట్టుగా తెలుగు సినిమా పరిశ్రమలో పరిస్థితి నెలకొంది.
ఇక పొన్నియన్ సెల్వన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మన తెలుగులో చాలా అట్టహాసంగా చేశారు.
ఈ సినిమా తమిళ్ లో హిట్ అయిన ఫ్లాప్ అయినా తెలుగు సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ అవుతుందని వారికి ఒక నమ్మకం కలిగింది.
ఎందుకంటే ఆ ఈవెంట్ కి ఎంతోమంది హాజరవడమే అందుకు గల ముఖ్య కారణం.
"""/"/
ఇక సినిమాలో ఎవరు ఉన్నారు ? ఎలాంటి స్టార్ క్యాస్ట్ ఉంది ? లాంటి విషయాన్ని పక్కన పెట్టి మరి ఈ సినిమాని హైప్ చేయడం నిజంగా తెలుగు ప్రేక్షకుల గొప్పతనం అనే చెప్పొచ్చు.
అలాగే కరణ్ జోహార్ లాంటి ఒక బాలీవుడ్ ప్రొడ్యూసర్ సైతం మన తెలుగు జనాలని నెత్తిన పెట్టుకున్నాడు అంటే మన ప్రస్తుత సినిమా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇక హీరో దుల్కర్ సల్మాన్ స్వతహాగా మలయాళీ అయినా కూడా తెలుగులో వరుస సక్సెస్ లు అందుకోవడం బట్టి చూస్తే మన ఆడియన్స్ టేస్ట్ ఏంటో కూడా అర్థం చేసుకోవచ్చు.
ఒక సినిమాలు మాత్రమే కాదు వేరే భాషల హీరోలు, హీరోయిన్స్ ని కూడా మన తెలుగు వాళ్ళు ఆదరిస్తుండడం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా కూడా నిలబెడుతున్నాయి.
వావ్, ఆటోను మినీ లైబ్రరీగా మార్చేసిన డ్రైవర్.. బుక్స్ ఫ్రీగా తీసుకోవచ్చట..