రాష్ట్రంలో అరాచక పాలనకు నిదర్శనమే చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాయత్నం కేసు…కొల్లు రవీంద్ర

రాష్ట్రంలో అరాచక పాలనకు నిదర్శనమే చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాయత్నం కేసు.

కేసులు పెట్టి ఆపాలని చూస్తున్నారు.అంతకు రెట్టింపుతో మీ అవినీతి అక్రమాలు బయట పెడతాం.

అవసరమైతే జైల్ భరో కార్యక్రమంతో జైళ్లలో మా నిరసన తెలియజేస్తాం.అవసరమైతే క్విట్ ఇండియా లాగా ఈ రాష్ట్రం నుండి క్విట్ జగన్ కార్యక్రమం చెబుతాం.

రాష్ట్రవ్యాప్తంగా నారా చంద్రబాబునాయుడు( Chandrababu Naidu ) గారు పర్యటిస్తూ ప్రాజెక్టులపై ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని, అక్రమాలను ప్రజలకు వివరిస్తూ, ప్రశ్నిస్తూ ముందుకెళుతుంటే ఈ వైసీపీ నాయకులకు మింగుడు పడలేదు.

ప్రాజెక్టుల గురించి నిజానిజాలు ప్రజలకు వివరిస్తున్నాడు అని అంగళ్లులో చంద్రబాబు గారిపైనే హత్యాయత్నం చేశారు, తిరిగి బబుగారిపైన హత్యాయత్నం కేసు పెట్టారు.

? దాడి చేసింది వైసిపి గుండాలు, పక్కనుండి చేయించింది పోలీసులు కానీ కేసులు మాత్రం చంద్రబాబు గారిమీద.

ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో వుంది ఈ ఒక్క సంఘటన నిరూపిస్తుంది.

జగన్ మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) ఇంకా నీ పతనాన్ని ఎవరు ఆపలేరు.

ఈ రాష్ట్రం నుండి తరిమితరిమి కొడతాం.

దగ్గును కేవలం 2 రోజుల్లో తరిమికొట్టే పవర్ ఫుల్ రెమెడీ ఇది.. డోంట్ మిస్!