సీఐడీ విచారణకు హాజరైన కొలికిపూడి శ్రీనివాస్..!!
TeluguStop.com
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బెదిరింపుల కేసులో అమరావతి జేఏసీ కన్వీనర్ కొలికిపూడి శ్రీనివాస్ రావు సీఐడీ కార్యాలయానికి వచ్చారు.
గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు అయ్యారు.దర్శకుడు ఆర్జీవీని చంపి తలను తీసుకొచ్చిన వారికి రూ.
కోటి ఇస్తామంటూ ఓ టీవీ డిబేట్ లో సుఫారీ ప్రకటించారని రామ్ గోపాల్ వర్మ కేసు పెట్టిన సంగతి తెలిసిందే.
ఫిర్యాదు నేపథ్యంలో కేసులో కొలికిపూడి శ్రీనివాస్ కు సీఐడీ 41 ఏ కింద నోటీసులు జారీ చేసింది.
ఈ మేరకు గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
సీఐడీ నోటీసుల మేరకు కొలికపూడి విచారణకు హాజరయ్యారు.