వీడియో వైరల్: భావోద్వేగానికి గురైన కోహ్లీ, రవిశాస్త్రి..!

నిత్యం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు హల్చల్ చేస్తూ ఉంటాయి.ఈ క్రమంలోనే ఇప్పుడు క్రికెట్ అభిమానుల మనసును చలింప చేసే వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

ఈ వీడియో భారత్ కెప్టెన్ కోహ్లీ, భారత్ ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రిల మధ్య జరిగిన బావోద్వేగమైన సన్నివేశం అనే చెప్పాలి.

టీమ్ ఇండియా ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2021 మ్యాచ్‌ లో నమీబియా పై భారత్ విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.

ఆ తర్వాత భారత కెప్టెన్ కోహ్లి ప్రధాన కోచ్ శాస్త్రిల శకం ముగిసిందనే చెప్పాలి.

నమీబియాతో జరిగిన చివరి టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌ లో కేఎల్ రాహుల్ అద్భుతమైన విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత కోహ్లీ, రవిశాస్త్రి కౌగిలించుకుని తమ ప్రయాణాలకు తుది ముగింపు పలికారు.

ఎందుకంటే టీమ్ ఇండియా క్రికెట్ జట్టుకు సెమీ-ఫైనల్‌ కు వెళ్లే అవకాశం లేదు.

అందుకనే కోహ్లీ, శాస్త్రి ఇద్దరూ కలిసి వారి చివరి ప్రయాణం ఈ మ్యాచ్‌ తోనే అయిపోయింది.

సోమవారం నమీబియాపై ఆడిన మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత స్పిన్నర్‌ ఆర్‌.

అశ్విన్‌, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ తర్వాత భారత కెప్టెన్‌ కోహ్లి, తమ హెడ్‌ కోచ్‌ శాస్త్రిని కౌగిలించుకున్న వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

"""/"/ భారత టీ20 కెప్టెన్‌గా కోహ్లీకి ఇది చివరి మ్యాచ్.అలాగే భారత కోచింగ్ సిబ్బందిగా రవిశాస్త్రి, అరుణ్‌ లకు కూడా ఇదే చివరి మ్యాచ్.

అందువల్ల మ్యాచ్ ముగిసిన అనంతరం వీరంతా తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు.ఈ క్రమంలో మైదానంలో జరిగిన సన్నివేశాలకు చెందిన వీడియో క్లిపింగ్స్ ను ఐసీసీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

ఆ భావోద్వేగ దృశ్యాలకు సంబంధించిన వీడియోతో పాటు, ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా మారాయి.

వారి మధ్య జరిగిన ఈ సన్నివేశాలను చుసిన అభిమానులు కూడా తమదైన శైలిలో కామెంట్స్ పెడుతూ వారికి తుది వీడ్కోలు చెపుతున్నారు.

భారతీయ వ్యక్తి ఇంటి తలుపు తట్టిన అదృష్ట దేవత..