ఐపీఎల్ లో బద్ధ శత్రువులు.. వరల్డ్ కప్ లో మిత్రులుగా..!

తాజాగా జరిగిన భారత్ - ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో ఓ ఆసక్తికరమైన సంఘటన మైదానంలో ఉండే ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

ఐపీఎల్ లో విరాట్ కోహ్లీకు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ నవీన్ ఉల్ హక్( Naveen Ul Haq ) మధ్య గొడవ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.

బెంగుళూరు వర్సెస్ లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో వీరిద్దరూ గొడవపడ్డారు.అప్పటినుండి సోషల్ మీడియా వేదికగా ఈ వివాదం రాజుకుంది.

తాజాగా జరిగిన మ్యాచ్లో వీరిద్దరి మధ్య ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అని ప్రేక్షకులంతా అనుకున్నారు.

విరాట్ కోహ్లీ( Virat Kohli ) బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.నవీన్ ఉల్ హక్ బౌలింగ్ చేస్తే ఎలా ఉంటుందో అని అంతా అనుకున్నారు.

అయితే వీరిద్దరూ కలిసిపోయి.ఒకరినొకరు హగ్ చేసుకున్నారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది.ఐపీఎల్ లో( IPL ) బద్ధ శత్రువులు.

ప్రపంచ కప్ లో( World Cup ) కలిసిపోయారంటూ క్రికెట్ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది.

ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లైన హస్మతుల్లా షహీది 80, అజ్మతుల్లా ఒమర్ జాయ్ 62 పరుగులు చేశారు.

"""/" / భారత బౌలర్లైన జస్ప్రిత్ బుమ్రా 4, హర్థిక్ పాండ్య 2 వికెట్లు తీశారు.

అనంతరం లక్ష్య చేదనకు దిగిన భారత జట్టు( Team India ) 35 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.

భారత జట్టు ఓపెనర్లైన కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడి మొదటి వికెట్ కు 156 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

రోహిత్ శర్మ( Rohit Sharma ) 131 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

"""/" / ఇషాన్ కిషన్( Ishan Kishan ) 47 పరుగులతో రాణించాడు.

విరాట్ కోహ్లీ 55 పరుగులతో నాటౌట్ గా, శ్రేయస్ అయ్యర్ 25 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్( Rashid Khan ) రెండు వికెట్లు తీసుకుంటే మిగతా బౌలర్లు భారీ పరుగులను సమర్పించుకున్నారు.

దీంతో భారత్ వన్డే వరల్డ్ కప్ లో రెండవ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

భారత్ తన మూడవ మ్యాచ్ అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా పాకిస్తాన్ తో తలపడనుంది.

పురాణాలే కమర్షియల్ ముడి సరుకుగా ప్రస్తుతం వస్తున్న సినిమాలు !