కోహ్లీ మైదానంలోనే కాదు, కార్పొరేట్ బ్రాండ్ల విషయంలోనూ ముందున్నాడు!

ఎప్పుడూ మైదానంలో మంచి దూకుడుని ప్రదర్శిస్తున్న కోహ్లీ గత సంవత్సరం జరిగిన టి20 ప్రపంచకప్ తర్వాత కాస్త సైలెంట్ అయ్యాడనే చెప్పుకోవాలి.

అవును, అక్కడినుండి కోహ్లీకి కాలం అస్సలు కలిసి రావడం లేదు.ఈ క్రమంలో అతడే స్వయంగా భారత టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకోగా, ఆ తర్వాత BCCI అతడిని వన్డే కెప్టెన్సీ నుండి తొలగించింది.

ఇక సౌతాఫ్రికాలో అటు ఆటతో ఇటు కెప్టెన్ గా విఫలమై టెస్టు సారథ్యం నుంచి కూడా కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసినదే.

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ లో సెంచరీ చేసి కోహ్లీ దాదాపు 2 సంవత్సరాలు అవుతోంది.

మొత్తంగా ఈ అంశాలు అతని బ్రాండ్ వాల్యూని ప్రభావితం చేసాయి.2020లో 238 మిలియన్ డాలర్లుగా ఉన్న అతడి బ్రాండ్ వాల్యూ 2021వ సంవత్సరం నాటికి దాదాపు 52 మిలియన్ డాలర్ల మేర పడిపోయింది.

డఫ్ అండ్ ఫెల్ప్స్ ప్రకటించిన సెలబ్రిటీల బ్రాండ్ వాల్యూ లో కోహ్లీ బ్రాండ్ విలువ 186 మిలియన్ డాలర్లకు తగ్గింది.

అయితే బ్రాండ్ వాల్యూ ఈ మేర తగ్గినా కూడా భారత్ నుంచి టాప్ మోస్ట్ సెలబ్రిటీగా విరాట్ కోహ్లీనే కొనసాగడం కొసమెరుపు.

2021కి కూడా అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన భారత సెలబ్రిటీ జాబితాలో విరాట్ కోహ్లీనే అగ్రస్థానంలో ఉండటం గమనార్హం.

"""/"/ అవును.భారత్‌లో అత్యంత విలువైన సెలబ్రిటీ 2021గా భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ నిలవడం ప్రశంసనీయం.

వరుసగా 5 సంవత్సరాలుగా ఈ జాబితాలో కోహ్లీనే టాప్‌ ప్లేసులో వుంటూ వస్తున్నాడు.

ఇక కోహ్లీ తర్వాత స్థానాన్ని 15.83 కోట్ల డాలర్లతో బాలీవుడ్‌ నటుడు, 83 ఫేమ్ రణ్‌వీర్‌ సింగ్‌ దక్కించుకున్నాడు.

ఇక రణ్‌వీర్‌ తర్వాత 13.96 కోట్ల డాలర్లతో బాలీవుడ్ బడా స్టార్ అక్షయ్‌ కుమార్‌ రేసులో నిలిచారు.

అలాగే RRR సినిమాలో సీత పాత్రలో నటించిన అలియా 4వ స్థానంలో నిలిచింది.

ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ బ్రాండ్ వాల్యూ మాత్రం అమాంతం పెరిగింది.

2020లో అతడి బ్రాండ్ వాల్యూ దాదాపు 36 మిలియన్ డాలర్లుగా ఉండగా.ఇప్పుడు అది 61 మిలియన్ డాలర్లకు పెరిగి, ధోని ఐదో స్థానానికి చేరుకున్నాడు.

రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టడం లేదా.. అయితే ఈ పోషకాల లోపం కావొచ్చు!