25000 పరుగులు పూర్తిచేసిన 6వ అంతర్జాతీయ క్రికెటర్ గా కోహ్లీ అరుదైన రికార్డ్..!

ఢిల్లీ వేదికగా ఇండియా- ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో రికార్డు సృష్టించాడు.

అంతర్జాతీయ క్రికెట్లో 25 వేల పరుగులు చేసిన విరాట్ కోహ్లీ అంతర్జాతీయ స్థాయిలో ఆరవ బ్యాట్మెన్ గా, ఇండియా లో రెండవ బ్యాట్మెన్ గా అరుదైన ఘనత సాధించాడు.

సచిన్ టెండుల్కర్ (577 ఇన్నింగ్స్), రిక్కీ పాంటింగ్(588 ఇన్నింగ్స్), కుమార సంగక్కర(608 ఇన్నింగ్స్), మహెల జయవర్ధనే (701 ఇన్నింగ్స్) లలో 25 వేల పరుగులు చేయగా తాజాగా వీరి జాబితాలో విరాట్ కోహ్లీ చేరాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్ లో 44 పరుగులు, రెండవ ఇన్నింగ్స్ లో 20 పరుగులు చేసి అంతర్జాతీయ క్రికెట్లో 25వేల పరుగులు చేసిన వారి జాబితాలో చేరిపోయాడు.

"""/"/ మరొక పక్కా క్రికెటర్ల ఎలైట్ గ్రూపులో చూసినట్లయితే కోహ్లీ 25 వేల పరుగులు సాధించి ప్రథమ స్థానంలో ఉన్నాడు.

కేవలం 548 ఇన్నింగ్స్ లో ఆడి ఈ అరుదైన రికార్డు సృష్టించాడు. """/"/ అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ టెండుల్కర్ 577 ఇన్నింగ్స్ లలో 25 వేల పరుగులు చేశాడు.

అంటే ప్రథమ స్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్ ను కోహ్లీ బ్రేక్ చేయడంతో సచిన్ టెండుల్కర్ రెండవ స్థానానికి పరిమితమయ్యాడు.

ఇక 588 ఇన్నింగ్స్ లలో 25 వేల పరుగులు చేసిన రిక్కీ పాంటింగ్ మూడవ స్థానానికి పరిమితం కాగా, కుమార సంగక్కర నాలుగవ స్థానంలో, మహేల జయవర్ధనే ఐదవ స్థానంలో ఉన్నారు.

మొత్తానికి విరాట్ కోహ్లీ తక్కువ ఇన్నింగ్స్ లోనే 25 వేల పరుగులు పూర్తి చేసిన మొదటి అంతర్జాతీయ క్రికెటర్ గా అరుదైన రికార్డు సృష్టించాడు.

ఆ వీడియోలు తొలగించాలని హైకోర్టు మెట్లు ఎక్కిన ఆరాధ్య.. అసలేం జరిగిందంటే?