మ‌రో వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. ఈ సారి స్వ‌లింగ సంప‌ర్కుల విష‌యంలో..

మ‌రో వివాదంలో చిక్కుకున్న కోహ్లీ ఈ సారి స్వ‌లింగ సంప‌ర్కుల విష‌యంలో

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇప్పుడు గ‌డ్డు కాలం న‌డుస్తోంద‌నే చెప్పాలి.

మ‌రో వివాదంలో చిక్కుకున్న కోహ్లీ ఈ సారి స్వ‌లింగ సంప‌ర్కుల విష‌యంలో

ఎందుకంటే ఆయ‌న చేస్తున్న ప‌నులు తీవ్ర విమ‌ర్శ‌ల‌కు తావిస్తున్నాయి.ఇప్ప‌టికే ఆయ‌న టీ20 ప్రపంచకప్ లో దారుణంగా విఫ‌లం అవ‌డంతో నెటిజ‌న్లు ఆగ్ర‌హం మీద ఉన్నారు.

మ‌రో వివాదంలో చిక్కుకున్న కోహ్లీ ఈ సారి స్వ‌లింగ సంప‌ర్కుల విష‌యంలో

ఇక మ‌రీ ముఖ్యంగా పాకిస్తాన్ మీద ఓడిపోవ‌డంతో ఇండియ‌న్ అభిమానులు ఆయ‌న మీద ఫైర్ మీద ఉన్నారు.

ఏ చిన్న అవ‌కాశం దొరికినా ఏకి పారేస్తున్నారు.ఇలాంటి వారికి ఇప్పుడు ఓ బంప‌ర్ ఛాన్స్ దొరికిన‌ట్టు అయింది.

దీంతో వారంద‌రికీ మ‌ళ్లీ కోహ్లీ టార్గెట్ అయిపోయాడు.అయితే ఈ సారి స్వ‌లింగ సంప‌ర్కుల విష‌య‌లో ఆయ‌న్ను నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

రీసెంట్ గా పూణ‌నెలోని కోహ్లీ స్థాపించిన వ‌న్ 8 క‌మ్యూన్ అనే హోట‌ల్ త‌మ రెస్టారెంట్ లోకి స్వ‌లింగ సంప‌ర్కుల‌కు అనుమ‌తించ‌బోమ‌ని చెప్పింద‌నే వార్త‌లు బాగా ప్ర‌చారం అయిపోయాయి.

గ‌తంలో 2018 సంవ‌త్స‌రంలోనే సుప్రీంకోర్టు ఓ సంచ‌ల‌న తీర్పును ఇచ్చింది.స్వలింగ సంపర్కులను ఎవ‌రైనా అవమానించినా లేదంటే బహిష్కరించినా స‌రే వారి మీద కేసుల పెడ‌తామ‌ని చెప్పింది.

అది రాజ్యాంగానికి విరుద్ధం అంటూ తీర్పును కూడా ఇచ్చింది. """/"/ ఇప్పుడు ఇదే విష‌యాన్ని ఉంట‌కిస్తూ కోహ్లీకి చెందిన రెస్టారెంట్ వారు చేసిన ప్ర‌క‌ట‌నను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు నెటిజ‌న్లు.

ఇది మానవ హ‌క్కుల ఉల్లంఘ‌న అవుతుంద‌ని, రాజ్యాంగ విరుద్ధం అంటూ మండిపడుతున్నారు.గ‌తంలో కూడా కొన్ని రెస్టారెంట్లు ఇలాంటి ప్ర‌క‌ట‌న చేసి విమ‌ర్శ‌ల పాలు అయిన గ‌ట‌న‌లు కూడా మ‌నం చూశాం.

ఇప్పుడు కోహ్లీ వంతు రావ‌డంతో అంతా షాక్ అయిపోతున్నారు.సోషల్ మీడియా వేదికగా కోహ్లీ మీద విరుచుకుప‌డుతున్నారు.

ఇప్ప‌టికే ఓట‌మితో స‌త‌మ‌తం అవుతున్న కోహ్లీకి ఇదో పెద్ద స‌మ‌స్య‌గా మారిపోయింది.మ‌రి దీనిపై కోహ్లీ ఏమైనా స్పందిస్తాడో లేదో చూడాలి.