కోడెల మృతికి వైకాపా కారణమా?

మాజీ మంత్రి, మాజీ స్పీకర్‌ తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నాయకుడు కోడెల శివ ప్రసాద్‌ ఆత్మహత్య చేసుకోవడంపై తెలుగు దేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి ఒక్క తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నాయకుడితో కోడెలకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించి గుంటూరు జిల్లాపై తనదైన ముద్రను వేసిన కోడెల మృతికి రాజకీయ వేదింపులు కారణం అంటూ తెలుగు తమ్ములు విమర్శలు చేస్తున్నారు.

వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుండి లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్లుగా కోడెలపై ఆయన కుటుంబ సభ్యులపై వైకాపా ప్రభుత్వం కేసులు నమోదు చేసింది.

దాంతో ఆయన తీవ్ర మనస్థాపంకు గురవ్వడంతో పాటు, ఆయన ఇప్పటికే ఒసారి గుండె పోటుతో బాధ పడ్డారు.

ఆయన్ను ఇంకా ఇంకా వైకాపా ప్రభుత్వం వేదించడంతో చివరకు ఉరి వేసుకున్నట్లుగా తెలుగు దేశం పార్టీ నాయకులు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారం ఉందనే అహంకారంతో కోడెలను దారుణంగా అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.