ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాం సత్తా చాటేనా?

త్వరలో తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.అయితే పోటీలో చాలా మంది అభ్యర్థులు ఉన్నా ఒకరు మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వారెవరంటే ప్రొఫెసర్ కోదండరాం.తెలంగాణ ఉద్యమాన్ని అన్ని రకాల వర్గాలను ఏకం చేసి సమర్థవంతంగా నడిపించి జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణను సాధించడంలో కీలక పాత్రను పోషించిన వ్యక్తి ప్రొ.

కోదండరాం.తెలంగాణను సాధించిన తరువాత మంచి స్థానంలో ఉంటారనుకున్న కోదండరాం, కేసీఆర్ తో విభేదాల వల్ల తెలంగాణ జనసమితి పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణ కోసం ఎంతగానో పోరాడిన కోదండరాంను పట్టభద్రులు గుర్తిస్తారా లేరా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అయితే ఇప్పటికే ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తూ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని కోరుతున్నారు.

అయితే కోదండరాం ప్రచారం కంటే కోదండరాం తెలంగాణ రావడానికి చేసిన కృషిని గుర్తించి ఎమ్మెల్సీగా కోదండరాంకు పట్టం కడతారా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

కోదండరాం గెలిస్తే ఒక ఉద్యమకారుడికి తగిన గుర్తింపు దక్కినట్లు లెక్క.లేకపోతే ఇలా నిజాయితీగా కష్టపడే ఉద్యమకారుడికే ప్రజలు గుర్తుంచుకొని పట్టం కట్టకపోతే, ఇక భవిష్యత్తులో ప్రజల తరపున పోరాదదామని అనుకున్న వారు వెనుకడుగు వేసే అవకాశం ఉంటుంది.

అది ప్రజాస్వామ్యానికే ప్రమాదంగా మారే అవకాశం ఉంది.

పైసా ఖర్చు లేకుండా ఫేషియల్ గ్లో పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ రెమెడీ మీకోసం!