పట్టభద్రుల ఎన్నికలలో కోదండరాం సత్తా చాటేనా?

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం తరువాత కేసీఆర్ తో విభేదాలతో ప్రభుత్వంలో ఎటువంటి పదవీ తీసుకోకుండా కేసీఆర్ తో విభేదించి ఒంటరిగా ఉన్నాడు.

అయితే తదనంతరం తెలంగాణ జనసమితి పార్టీని స్థాపించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమిలో చేరి ఎన్నికల్లో పోటీ చేసిన పరిస్థితి ఉంది.

కాని ఆ ఎన్నికల్లో ప్రజలు కూటమిని నమ్మక మరల కేసీఆర్ కు పట్టం కట్టిన విషయం తెలిసిందే.

అయితే ఇక పట్టభద్రుల ఎన్నికల్లో కోదండరాం పోటీలో ఉన్నాడు.మరి తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించాడని చెప్పి పట్టభద్రులు కోదండరాంకు మద్దతు ఇస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.

ఏది ఏమైనా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కోదండరాంకు అగ్ని పరీక్ష అని చెప్పవచ్చు.

ఇప్పటికే పట్టభద్రులతో సమావేశాలు నిర్వహిస్తూ మద్దతు తెలుపమని కోదండరాం కోరుతున్న పరిస్థితి ఉంది.

తెలంగాణ రాష్ట్రం కోసం కోదండరాం చేసిన పోరాటాన్ని పట్టభద్రులు గుర్తుంచుకొని కోదండరాంకు మద్దతు పలికితే ఎమ్మెల్సీగా గెలుపొందడం ఖాయం.

అంతిమంగా ఎవరికి పట్టభద్రుల మద్దతు ఉంటుందనేది చూడాల్సి ఉంది.అంతేకాక పోటీలో అందరూ కోదండరాంకు గట్టి పోటీ ఇస్తుండటంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశం ఉంది.

రిస్క్ తీసుకోవడానికి సిద్ధమైన జగన్.. వైసీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలివే!