టీడీపీ మేనిఫెస్టోపై కొడాలి నాని కౌంటర్
TeluguStop.com
మహానాడులో భాగంగా టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మేనిఫెస్టోలో చెప్పిన హామీలను చంద్రబాబు ఏనాడు నెరవేర్చలేదని తెలిపారు.టీడీపీ మేనిఫెస్టోలు తీసుకురండన్న కొడాలి నాని చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
వైసీపీని, సీఎం జగన్ ను తిట్టేందుకే మహానాడు పెట్టారని విమర్శించారు.దివంగత నేత ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చేసే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.
అదేవిధంగా డయాస్ పై బాలకృష్ణ ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.కేవలం చంద్రబాబును పొగిడేందుకు మాత్రమే సభలన్న ఆయన ఎన్టీఆర్ చావుకు చంద్రబాబే కారణమని ఆరోపించారు.
ఓరి నాయనో, నోట్ల కట్టలతో రాజస్థాన్ టెంపుల్ నిండిపోయింది.. కానుకలు లెక్కించడానికే 5 రోజులు?