చిరంజీవిని విమర్శిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు.. కొడాలి నాని కామెంట్స్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గురించి వైసిపి నాయకులు గత కొద్ది రోజుల క్రితం తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించిన సంగతి మనకు తెలిసిందే.

అయితే తాజాగా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) చిరంజీవి గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

గతంలో కొడాలి నాని చిరంజీవిని విమర్శలు చేశారు అంటూ ఆరోపణలు చేయడంతో నాని స్పందించి దమ్ముంటే నిరూపించాలి అంటూ జనసేన పార్టీ కి అలాగే తెలుగుదేశం పార్టీ కి సవాల్ విసిరారు.

"""/" / ఇదిలా ఉండగా నేడు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా గుడివాడలో( Guada ) చిరంజీవి పుట్టిన రోజు వేడుకలలో పాల్గొన్నటువంటి ఈయన చిరంజీవి గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి గారిని విమర్శిస్తే రాజకీయంగా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో నాకు తెలుసు.చిరంజీవి ఎవరి జోలికి వెళ్లరు.

ఆయన పట్ల నేను ఎందుకు విమర్శలు చేస్తానని ఈయన తెలిపారు.తాను ఎప్పుడూ కూడా చిరంజీవి గారిని విమర్శించలేదని నేను శ్రీరామ అంటే జనసేన(Janasena Party) టిడిపి(Telugu Desam Party) నాయకులకు బూతుల్లా ఉంటాయని నాని తెలియజేశారు.

"""/" / ఎవరి జోలికి వెళ్ళని చిరంజీవి గురించి విమర్శలు చేసే అంత సంస్కారహీనుడిని తాను కాదని ఈయన తెలియజేశారు.

సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ఓ శిఖరం, ఆయన్ని నేను ఎందుకు తిడతాను.చిరుకి, తమకు అగాథం సృష్టించాలని టీడీపీ, జనసేన కుట్ర చేస్తున్నాయంటూ ఈయన విమర్శించడమే కాకుండా తాను చిరంజీవి గురించి ఏం మాట్లాడాను అనే విషయాలు ఆయనకు ఆయన అభిమానులకు తెలుసు అంటూ చిరంజీవి పుట్టినరోజు(Chiranjeevi Birthday) సందర్భంగా ఆయన గురించి, నాని చేసినటువంటి ఈ కామెంట్స్ ఇటు సినీ వర్గాలలో అటు రాజకీయపరంగా కూడా చర్చలకు కారణమయ్యాయి.

పెళ్లి వేడుకలో ఊహించని ట్విస్ట్.. వరుడి ఫ్రూటీలో రమ్ము కలిపిన స్నేహితుడు.. తర్వాతేమైందో మీరే చూడండి!