Kodali Nani : ఇళ్ల పట్టాల విషయంలో టీడీపీపై కొడాలి నాని సీరియస్ వ్యాఖ్యలు..!!
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా 50 రోజులు మాత్రమే సమయం ఉంది.ఆల్రెడీ ప్రధాన పార్టీల నేతలు ప్రచారం మొదలుపెట్టేశారు.
ఇక ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల సైతం తమదైన శైలిలో నియోజకవర్గాలలో ప్రచారం చేస్తున్నారు.
ఈ రకంగానే గుడివాడ వైసీపీ( YCP ) ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు.
ఇవే తనకు చివరి ఎన్నికలని కొద్దిరోజుల క్రితం ప్రకటించడం జరిగింది.2029 ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.
అప్పటికే తన వయసు 58 అవుతుందని దాంతో.రాజకీయాలు చేయటం కుదరదని వ్యాఖ్యానించారు.
"""/" /
ఈ క్రమంలో ఇంకా ఎన్నికలకు 50 రోజులు మాత్రమే సమయం ఉండటంతో గుడివాడ నియోజకవర్గం ( Guada Constituency )లో కొడాలి నాని( Kodali Nani ) భారీ ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు.
దీనిలో భాగంగా గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎవరైనా అర్హత ఉండి ఇంటి స్థలం రాలేదని ఒకరితో చెప్పించినా ఎన్నికలలో పోటీ చేయనని స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో గుడివాడలో సెంటు స్థలం కూడా పేదలకు ఇవ్వలేదు.వైసీపీ పాలనలో అర్హులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చాం.
చంద్రబాబు పేదలకు పట్టా రిజిస్ట్రేషన్ చేశారని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.సీఎం జగన్ పాలన దేశ చరిత్రలో ఒక రికార్డు.
మళ్లీ ఆయనే ముఖ్యమంత్రిగా రావాలి అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
ఏపీలో ఆ మూడు సినిమాలకు బెనిఫిట్ షోలకు ఛాన్స్ ఇస్తారా.. తప్పు అస్సలు జరగదంటూ?