సీఎం రేవంత్ పై కొడాలి నాని సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy )పై మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఆ సమయంలో తాను ముఖ్యమంత్రి అయినప్పుడు పక్క తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీ సీఎం జగన్ తనకి ఫోన్ కూడా చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఈ కామెంట్లపై ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు.రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత సీఎం జగన్ మోహన్ రెడ్డి( CM YS Jagan ) ట్విట్టర్ లో విషెస్ తెలియజేశారని అన్నారు.

ఫోన్ చేసి చెప్పడానికి తాము కాంగ్రెస్ పార్టీలో లేమన్నారు.అసలు రేవంత్ రెడ్డికి ఎందుకు ఫోన్ చేయాలని, ఎందుకు కలవాలని కొడాలి నాని ప్రశ్నించారు.

రేవంత్ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకునే సమయం సీఎం జగన్ కి లేదన్నారు.

పక్క రాష్ట్రంలో ఎన్నికలకు మాకు ఏం సంబంధం లేదు.కాంగ్రెస్ లో చేరిన రేవంత్ .

షర్మిల( YS Sharmila )కు మద్దతు ఇవ్వడంలో తప్పేముంది.రేవంత్ రెడ్డి ఏపీకి వచ్చి పీసీసీ బాధ్యత తీసుకోమని చెప్పండి.

చంద్రబాబును గెలిపించడం కోసం రేవంత్ ఏపీకి వస్తాడేమో అని సీరియస్ కామెంట్స్ చేశారు.

వచ్చే ఎన్నికలకు సంబంధించి.చంద్రబాబు( Chandrababu ) టికెట్లు అమ్ముకుంటున్నారు, 150 కోట్లకు ఎంపీ సీటు కేశినేని చిన్నికి అమ్ముకున్నాడు అని ఆరోపించారు.

కష్ట కాలంలో పార్టీ కోసం పనిచేసిన కేశినేని నాని( Kesineni Nani )ని బాబు మోసం చేశారు.

నా గుడివాడలో కూడా 100 కోట్లు ఇచ్చినోడికి సీటు ఇచ్చారు.రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లు కూడా చంద్రబాబు అమ్ముకుంటున్నాడు అంటూ కొడాలి నాని సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

అల్లు అర్జున్ కేసు వాదించిన నిరంజన్ రెడ్డి ఎవరు? ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా?