చంద్రబాబు..పవన్ కలయికపై కొడాలి నాని సీరియస్ కామెంట్స్..!!
TeluguStop.com

గుడివాడ ఎమ్మెల్యే వైసీపీ( MLA YCP ) ఫైర్ బ్రాండ్ కొడాలి నాని( Kodali Nani ) సీరియస్ వ్యాఖ్యలు చేశారు.


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కలయికపై మరోసారి విరుచుకుపడ్డారు.


కృష్ణాజిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కొడాలి నాని.పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనాలంటే చంద్రబాబు మద్దతు కావాలని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు( Chandrababu ) 18 స్థానాలలో ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలంటే పవన్ కళ్యాణ్ మద్దతు కావాలని అన్నారు.
పవన్ కళ్యాణ్ కి అసెంబ్లీ లోకి అడుగు పెట్టాలని ఆశ ఉంది.కానీ ఒంటరిగా పోటీ చేస్తే మైకు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాకలేరు.
అని కొడాలి నాని అన్నారు.అందువల్లే చంద్రబాబు సపోర్ట్ పవన్ తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
ప్రతిపక్ష హోదా కోసం చంద్రబాబు,, ఎమ్మెల్యే అవటానికి పవన్ కళ్యాణ్ పొత్తులు పెట్టుకున్నారని కొడాలి నాని సెటైర్లు వేశారు.
ఇక చంద్రబాబు అరెస్టు గురించి మాట్లాడుతూ గతంలో 18 కేసులలో స్టే తెచ్చుకున్నారు.
ఎక్కడా కూడా తప్పు చేయలేదని చెప్పటం లేదు.గవర్నర్ అనుమతి తీసుకోలేదని మాత్రమే చెబుతున్నారు.
వచ్చే ఎన్నికలలో పవన్ ఎక్కడ నుండి పోటీ చేస్తున్నారో చెప్పాలని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కన్నప్ప లో ఒకప్పటి మోహన్ బాబు కనిపిస్తాడా..?