వి వి వినాయక్ డైరెక్టర్ అవ్వడానికి కొడాలి నాని కి ఉన్న సంబంధం ఎంటో తెలుసా?

వివి వినాయక్ తన సొంత ఊరులో తన తండ్రి పెట్టిన వినాయక్ థియేటర్లో సినిమాలు చూస్తూ పెరిగి సినిమా ఇండస్ట్రీకి రావాలని కలలు కన్నాడు.

ఇంట్లో అందరూ వద్దని వారించిన వినకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.ఖైదీ సినిమాను లెక్కలేనన్ని సార్లు చూసి చిరంజీవిని డైరెక్ట్ చేయాలని ఎన్నో కథలు రాసుకున్నాడు.

అలా 1994లో హైదరాబాద్ లో అడుగు పెట్టాడు వీర వెంకట వినాయకరావు.తొలి ఆరు నెలలు హైదరాబాద్ తనకు జీవితం అంటే ఏంటో నేర్పించింది.

ఎన్నో కష్టాలు ఎదురైనా కూడా ఎంతో ఓపికగా ఎదురు చూశాడు వినాయక్.మెల్లిగా అమ్మ దొంగ సినిమా దర్శకుడు అయినా సాగర్ దగ్గర అప్రెంటిస్ గా జాయిన్ అయ్యాడు.

ఆ తర్వాత తన చలాకి తనంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎదిగాడు.అక్కడే నల్లమలుపు బుజ్జి, శ్రీను వైట్ల వంట వారితో స్నేహం చేశాడు.

ఓ రోజు జూనియర్ ఎన్టీఆర్ ని చూసిన వినాయక్ అచ్చం పెద్దాయన లాగే ఉన్నాడు ఇలాంటి వ్యక్తితో మంచి మాస్ సినిమా తీయాలని అన్నాడట.

ఈ మాటలు కొడాలి నాని చెవిలో పడ్డాయి.అప్పటికే కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులు కావడంతో ఈ విషయం తారక్ చెవిలో వేశాడు.

నల్లమలుపు బుజ్జి కి నానీ కూడా స్నేహం ఉండడంతో వినాయక్ గురించి నానికి తెలిసింది.

"""/"/ దాంతో నాని ఎన్టీఆర్ తో ఇప్పటివరకు నువ్వు అన్ని స్టూడెంట్ సినిమాల చేశావు నీకు మాస్ ఇమేజ్ కావాలంటే మంచి మా సినిమా తీయాలి అది వినాయక్ లాంటి దర్శకుడు తోనే తీయాలని చెప్పాడట కానీ ఎన్టీఆర్ వినాయక్ ని లైట్ తీసుకున్నాడట.

ఎంతోమంది కథలు చెబుతున్న అవేమీ నచ్చట్లేదు ఆ సమయంలో తారక్ కి.అలా కసి మీద వినాయక్ మంచి మాస్ కథ చెప్పడంతో అది నచ్చింది తారక్ కి.

దాంతో వీరిద్దరి దర్శకత్వంలో ఆది సినిమా రూపుదిద్దుతుంది.ఆ తర్వాత నైజాం డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు వినాయక్ నీ ఒక సినిమా తీసి పెట్టమని అడిగాడట.

అలా దిల్ రాజు సినిమా రూపుదిద్దుకుంది.

మరోసారి వెండితెర సందడికి సిద్ధమైన యాంకర్ సుమ…. హిట్ కొట్టేనా?