ఈనాడులో చంద్రబాబు కి ఉద్యోగం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేయడంలో ఎప్పుడూ ముందువరసలో ఉంటున్నారు ఏపీ మంత్రి కొడాలి నాని.

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు నాని.రామోజీరావు నడిపిస్తున్న ఈనాడు సంస్థలో చంద్రబాబు ఓ ఉద్యోగి అంటూ కొడాలి నాని విమర్శలు చేశారు.

తెలుగుదేశం పార్టీలోకి అడ్డగోలుగా చొరబడి, ఆపై పార్టీని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు కాదా అంటూ నాని ప్రశ్నచించారు.

అప్పట్లో వైస్రాయ్ హోటల్ లో 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేకుండా, 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఈనాడులో తప్పుడు కథనాలు రాయించుకున్నది నువ్వు కాదా అంటూ ప్రశ్నించారు.

నిన్న కావాలనే తనకు కేటాయించిన గేటులో నుంచి రాకుండా, ఓ పథకం ప్రకారం, బయటి వ్యక్తులను వెంటేసుకుని ఎమ్మెల్యేలు వచ్చే గేటులో నుంచి వచ్చారని ఆరోపించారు.

అసెంబ్లీ నిబంధనలకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు, పోస్టర్‌ లను పట్టుకుని దౌర్జన్యం చేశారని అన్నారు.

మార్షల్స్ పై బూతులు ప్రయోగించారంటూ నాని మండిపడ్డారు.

డబుల్ ఇస్మార్ట్ టీజర్ లో ఒక్కటి మిస్ అయింది.. అదేంటంటే..?