టీడీపీ అధికారంలోకి వస్తే ఫస్ట్ టార్గెట్ ఆయనేనా?
TeluguStop.com
రాజకీయాలు అన్న తర్వాత విమర్శలు కామన్.ఈరోజు ఒక పార్టీ అధికారంలో ఉంటే.
రేపు మరో పార్టీ అధికారంలోకి రావొచ్చు.కానీ విమర్శలు ఆహ్వానించదగ్గవిగా ఉండాలి.
అంతేకానీ చెప్పుకోవడానికి, రాయడానికి కూడా అభ్యంతరకంగా ఉండేలా విమర్శలు చేస్తే ఎవరికి లాభం? ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నేతల విమర్శలు ఇలాగే ఉంటున్నాయి.
ఏదో పగ పట్టేసినట్లు, ఎదుటివ్యక్తి కనిపిస్తే హత్య చేసేలా విమర్శలు చేస్తున్నారు.అధికారం శాశ్వతం కాదు మనుషులు మాత్రమే శాశ్వతం అని వైసీపీ నేతలు గ్రహించకపోవడమే సమస్యగా మారింది.
వైసీపీ నేతలు ప్రెస్‌మీట్ పెట్టారంటే ఇంట్లో ఫ్యామిలీలు ఉండే టీవీలు కట్టేసుకోవడమే బెటర్ అనే ఫీలింగ్‌లో ప్రజలు ఉన్నారంటే వాళ్ల విమర్శలు ఎంత దారుణంగా ఉంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ నేపథ్యంలో టీడీపీ వాళ్లు లిస్ట్ రాసుకుంటున్నారట.ఈ విషయంపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
తాము అధికారంలోకి వస్తే లెక్కకు లెక్క సరిచేస్తామని చెప్పారు.టీడీపీ ప్రభుత్వం రాగానే టార్గెట్ చేసే తొలి వ్యక్తి కొడాలి నానినే అని వంగలపూడి అనిత స్పష్టం చేశారు.
అసభ్య పదజాలానికి ఆయన పేటెంట్ హక్కులు పొందారని.ఇప్పటివరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాని ఎంత పడితే అంత మాట్లాడతామంటే ఎలా కుదురుతుందని ఆమె ప్రశ్నించారు.
"""/"/ ఆయన్ను కొడతారా అని యాంకర్ అడగ్గా.లేదని.
అంతా పద్ధతి ప్రకారమే చేస్తామని వంగలపూడి అనిత సమాధానం చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కుక్క కాటుకు చెప్పు దెబ్బే కరెక్ట్ అంటూ తనపై, టీడీపీపై విమర్శలు చేసేవారికి వంగలపూడి అనిత కౌంటర్ ఇచ్చారు.
గతంలో తనను అసెంబ్లీ సాక్షిగా బాడీ షేమింగ్, వ్యక్తిగత విషయాలను ప్రస్తావించి వైసీపీ నేతలు తనను టార్గెట్ చేశారని.
ఎన్ని కష్టాలు ఎదురైనా సరే తట్టుకుని నిలబడతాను అన్న నమ్మకం తనకు వచ్చిందన్నారు.
కాగా వంగలపూడి అనిత వ్యాఖ్యలను పరిశీలిస్తే కొడాలి నాని విషయంలో తాము చట్టప్రకారమే ముందుకు వెళ్తామని స్పష్టంగా చెప్పారు.
అంటే టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ నేతల అరెస్టులు కూడా ఉంటాయని పరోక్షంగా చెప్పేశారు.
పూరీ జగన్నాధ్ ను కాదని చిరంజీవి శ్రీకాంత్ ఒదెలకి ఛాన్స్ ఇవ్వడానికి కారణం ఏంటి..?