కొడాలి నాని, బుగ్గన నామినేషన్లకు ఆమోదం..!!

మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి( YCP MLA Kodali Nani, Minister Buggana Rajendranath Reddy ) నామినేషన్స్ సాయంత్రం వరకు పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

కొడాలి నాని అఫిడవిట్ లో తప్పుడు సమాచారం అందించారని రిటర్నింగ్ అధికారికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

మున్సిపల్ కార్యాలయాన్ని కొడాలి నాని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్టు ఫిర్యాదుల పేర్కొన్నారు.ఇక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆఫిడవిట్ లో ఆస్తుల వివరాలు సమర్పించలేదని అభ్యంతరాలు తెలపడం జరిగింది.

అయితే వీరిద్దరి నామినేషన్లకు చివరి క్షణంలో ఆమోదం లభించింది.సాయంత్రం వరకు ఉత్కంఠ భరితంగా.

ఉండగా నామినేషన్స్ ఆమోదించినట్లు ఆర్వో ప్రకటించారు. """/" / ఏపీలో ఎన్నికలకు ఇంకా 17 రోజులు మాత్రమే సమయం ఉంది.

ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు దూసుకుపోతున్నారు.శనివారం 2024 వైసీపీ మేనిఫెస్టో ( YCP Manifesto )విడుదల కాబోతుంది.

ఈసారి ఎన్నికలను వైయస్ జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఇదే సమయంలో ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి అనేక సర్వేలు చేసి.

బరిలో దింపడం జరిగింది.అనంతరం సిద్ధం, మేమంతా సిద్ధం కార్యక్రమాలతో.

మొన్నటి వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఏప్రిల్ 28 నుండి రాష్ట్రవ్యాప్తంగా రోజుకి మూడు నియోజకవర్గాలలో.

సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.2024 ఎన్నికలు హోరాహోరీగా ఉన్నాయి.

2014లో ఏర్పడిన బీజేపీ.టీడీపీ.

జనసేన కూటమి.ఈసారి కూడా ఏర్పడటం జరిగింది.

దీంతో ఏపీలో జరగబోయే ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

నల్లటి వలయాలను మాయం చేసే సూపర్ పవర్ ఫుల్ రెమెడీస్ ఇవే!