కొడాలి ఇమేజ్ త‌గ్గిందా…  వైసీపీలో ఇదే హాట్ టాపిక్ ?

కొడాలి ఇమేజ్ త‌గ్గిందా…  వైసీపీలో ఇదే హాట్ టాపిక్ ?

కృష్ణాజిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు ఫైర్ బ్రాండ్‌ మంత్రి కొడాలి నాని ఇమేజ్ త‌గ్గిపోయిందా? ఆయ‌న దూకుడు పెద్ద గా వ‌ర్క‌వుట్ కావ‌డం లేదా? ఇదేదో టీడీపీలోనోమంత్రి కొడాలి అంటే గిట్ట‌నివారో చెబుతున్న మాట‌లు కాదు.

కొడాలి ఇమేజ్ త‌గ్గిందా…  వైసీపీలో ఇదే హాట్ టాపిక్ ?

ఏకంగా అధికార పార్టీ ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్టీ వైసీపీలోనే జ‌రుగుతున్న అంత‌ర్గ‌త చ‌ర్చ‌.

కొడాలి ఇమేజ్ త‌గ్గిందా…  వైసీపీలో ఇదే హాట్ టాపిక్ ?

ప్ర‌స్తుతం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌ను గెలిపించే బాధ్య‌త‌ల‌ను మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్ర‌రెడ్డితోపాటు కొడాలి నానికి కూడా అప్ప‌గించారు.

ఈ క్ర‌మంలో కొడాలి విజ‌య‌వాడ‌లో దూకుడుగా వ్య‌వ‌హ‌రించాల‌ని అనుకున్నారు.హుటాహుటిన రోడ్ షోల‌కు కూడా ప్లాన్ చేశారు.

కొన్ని ప్రాంతాల‌ను ఎంచుకుని మ‌రీ రోడ్ షో నిర్వ‌హించారు.ప్ర‌ధానంగా శివారు ప్రాంతాల‌ను ఎంచుకుని మాస్ ఎక్కువ‌గా ఉన్న చోట రోడ్ షో చేస్తే త‌న వ్యాఖ్య‌ల‌కు, డైలాగుల‌కు మంచి ఫాలోయింగ్ వ‌స్తుంద‌ని అనుకున్నారు.

ఈ క్ర‌మంలోనే రెండు రోజుల కింద‌ట పైపుల్ రోడ్‌, వాంబేకాల‌నీ, రాజీవ్‌న‌గ‌ర్ వంటి ప్రాంతాల‌ను ఎంచుకుని సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేశారు.

ఆయా ప్రాంతాల్లో జ‌నాల‌ను త‌ర‌లించే బాద్య‌త‌ను ఎమ్మెల్య మ‌ల్లాది విష్ణు చూసుకున్నారు.కానీ ఆశించిన విధంగా ఈ రోడ్ షోలు స‌క్సెస్ కాలేదు.

దీంతో కొడాలి లైట్ తీసుకున్నా దీనిని ప‌రిశీలించిన వారు మాత్రం సీరియ‌స్‌గానే భావిస్తున్నారు.

"""/"/ నిజానికి కొడాలి వ్యాఖ్య‌లు అంటే యువ‌త పెద్ద ఎత్తున ఎగ‌బ‌డ‌తార‌నే పేరుంది.

అయితే ఇప్పుడు ఆయ‌న వ్యాఖ్య‌లు వినేందుకు పెద్ద‌గా ఎవ‌రూ త‌ర‌లిరాలేదు.పైగా ఆయ‌న నిర్వ‌హించిన రోడ్ షోలు కూడా చ‌ప్ప‌గా సాగాయి.

దీంతో రాజీవ్‌న‌గ‌ర్‌లో నిర్వ‌హించిన రోడ్ షోను స‌గంలోనే నిలుపుద‌ల చేసుకుని వెన‌క్కి వ‌చ్చేశారు.

దీంతో కొడాలి ఇమేజ్‌పై ప్ర‌భావం ఏమైనా ప‌డిందా? అనే చ‌ర్చ అధికార పార్టీలోనే సాగుతుండ‌డంగ‌మ‌నార్హం.

ఎందుకంటే ఎప్పుడో ఒక‌సారి ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై విరుచుకుప‌డితే ఎవ‌రైనా చూస్తారు నిజ‌మేనేమో అనుకుంటారు.

కానీ, నోరు విప్పిన‌ప్ప‌డల్లా అదేప‌నిగా తిడితే వినేవారికి కూడా బోర్ కొడుతుంది క‌దా?! ఇదే ఇప్పుడు కొడాలి విష‌యంలో నిజ‌మైంద‌నే భావ‌న క‌లుగుతోంది.

ప్ర‌స్తుతం ఇదే విష‌యాన్ని వైసీపీ నాయ‌కులు గుస‌గుస‌గా చ‌ర్చించుకుంటుండ‌డం గ‌మ‌నార్హం.మ‌రి మంత్రిగారు ఆత్మ విమ‌ర్శ చేసుకుని మార్చుకుంటారా?  చూడాలి.

ఇంటెల్ సీటీవో , ఏఐ చీఫ్‌గా భారత సంతతి ఎగ్జిక్యూటివ్.. ఎవరీ సచిన్ కట్టి?