కోదాడలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం.. !

మంచి భవిష్యత్తు ఉన్న యువతి యువకులు ప్రేమ మాయలో పడి, వాళ్ల జీవితాల్లో చీకటి వెలుగుల దారులను చూడకుండానే, కష్టసుఖాలు అనుభవించకుండానే, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ప్రేమే లోకం అని భావించి కన్న వారికి కడుపుకోత పెడుతున్నారు.ఇలా ఎందరో ఏం సాధించకుండానే ఈ మట్టిలో కలిసి పోతున్నారు.

ఇకపోతే తాజాగా సూర్యాపేట జిల్లా కోదాడలో కూడా ఓ ప్రేమ జంట మరణం కలకలం రేపింది.

ఆ వివరాలు చూస్తే.స్దానికంగా నివాసముండే యువతి, యువకుడు కనిపించడం లేదంటూ గురువారం కోదాడ పోలీసులకు వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారట.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు.ఈ క్రమంలో శుక్రవారం ఉదయం చెరువులో రెండు మృతదేహాలు కనిపించాయని స్దానికులు ఇచ్చిన ఫిర్యాదుతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారట పోలీసులు.

ఈ విషయాన్ని మిస్సైన యువతి యువకుని కుటుంబ సభ్యులకు కూడా తెలియచేయడంతో, వారు కూడా ఆ చెరువు వద్దకు వెళ్ళారట.

ఇక మృతదేహాలను చెరువులోంచి బయటకు తీయగా, ఆ మృతదేహలు తాము వెతుకున్న యువతీ యువకుడివే అని పోలీసులతో పాటుగా ఆ కుటుంబసభ్యులు గుర్తించారట.

"""/"/ కాగా ఈ మృతికి కారణాలు తెలియరాలేదు.కానీ ప్రేమ వ్యవహారం వల్లనే వీరు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.

ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తూ ప్రారంభించారట.

నెల్లిమర్ల బహిరంగ సభలో వైసీపీకి డిపాజిట్లు కూడా రావు అంటూ చంద్రబాబు