కోదాడ మద్యం జగ్గయ్యపేటలో…!
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: జగ్గయ్యపేట స్పెషల్ బ్యూరో అధికారులు షేర్ మహమ్మద్ పేట క్రాస్ రోడ్ వద్ద నేషనల్ హైవే 65 పై మంగళవారం జరిపిన వాహన సోదాలలో తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ పట్టణం నుండి ద్విచక్ర వాహనం లోపల సీటు క్రింద మరియు సైడ్ ప్యానల్స్ లోపల,డూమ్ లోపల రహస్యంగా అమర్చి తెలంగాణ రాష్ట్రం నుంచి సుంకం చెల్లించని అక్రమమద్యాన్ని తెలివిగా రవాణా చేస్తున్న స్మగ్లర్ ను జగ్గయ్యపేట స్పెషల్ ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు.
కోదాడ మండలం దోరకుంట గ్రామానికి చెందిన చిన్నపర్తి సీమ్మసర్తి రాజు మొత్తం 200 మద్యం బాటిల్స్ ని ద్విచక్ర వాహనంలో పైకి కనపడకుండా రహస్యంగా అమర్చి నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన
పెద్దమల్ల నరసింహారావు బెల్ట్ షాప్ నిర్వాహకునకు సరఫరా చేయుటకు తీసుకుని వెళ్ళుతున్నట్లు దర్యాప్తులో తేలింది.
కేసు తదుపరి విచారణలో భాగంగా అనాసాగరానికి చెందిన బెల్ట్ షాపు నిర్వాహకుడు పెద్దమల్ల నరసింహారావును స్థానిక జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో మొత్తం ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుండి తెలంగాణ రాష్ట్రానికి చెందిన 200 మద్యం సీసాలను,ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ విధంగా ఇతర రాష్ట్రాల నుండి సుంకం చెల్లించని మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జగ్గయ్యపేట స్పెషల్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠ రెడ్డి హెచ్చరించారు.
దేవర నిర్మాతల కంటే ఆయనకే ఎక్కువ లాభాలను అందించిందా.. ఏమైందంటే?