కోదాడ పెద్ద చెరువు అలుగు పగలగొట్టి నీటి విడుదల

సూర్యాపేట జిల్లా:కోదాడ పెద్ద చెరువులో చేపలు పట్టేందుకు చేపల సంఘం వారు చెరువు అలుగు పగలగొట్టి అక్రమంగా పైపులు వేసి నీటిని తొలగిస్తున్నారని సామాజిక కార్యకర్త కుదరవల్లి మోహన్ కృష్ణ (బసవయ్య)గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ మొదటి వారంలో పెద్ద చెరువులో ఉన్న నీటిని తొలగించడం వల్ల భూగర్భ జలాలు తగ్గి బావులలో, బోర్లలో నీరు లేకుండా పోవడంతో ఈ వేసవిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.

అలుగు పగలగొట్టిన రోజే ఇరిగేషన్ డీఈ దృష్టికి తీసుకుని వెళ్లగా రెవెన్యూ,పోలీసు, ఇరిగేషన్ శాఖా అధికారులు వచ్చి చేపల సంఘ సభ్యులపై కేసు పెట్టి చేతులు దులుపుకున్నారని అన్నారు.

చేపల సంఘం వారు వేసిన పైపులు అలాగే ఉండటం వల్ల నేడు చెరువులోని నీరు తొలగించి చేపలు పట్టుటకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెప్పారు.

ఇప్పటికైనా జిల్లా కలెక్టర్,కోదాడ డివిజన్ అధికారులు,ఇరిగేషన్ ఎస్ఈ స్పందించి సంబంధిత అధికారులకు తగు చర్యలు తీకొనేవిధంగా ఆదేశించాలని కోరారు.

ఇరిగేషన్ శాఖ,రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ,పోలీస్ శాఖ వెంటనే స్పందించి అలుగు పగలగొట్టి అక్రమంగా వేసిన పైపులను తొలగించి,పెద్ద చెరువులోని నీటిని కాపాడవల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

వైరల్ వీడియో: మాజీ మంత్రి రోజా తీరుపై నెటిజన్ల ఆగ్రహం.. మ్యాటరేంటంటే..