Koala Viral Video : ఫ్రెండ్ చచ్చిపోతే ఎక్కెక్కి ఏడ్చిన కోలా జంతువు.. హార్ట్‌బ్రేకింగ్ వీడియో వైరల్..

సాధారణంగా మనుషులకు చాలా భావోద్వేగాలు ఉంటాయి.అది అందరికీ తెలిసిన విషయమే.

అయితే మనుషుల తరహాలో జంతువులకు ( Animals ) కూడా కొన్ని ఫీలింగ్స్​ ఉంటాయి.

అవి కూడా అచ్చం మునుషుల్లాగానే బాధపడుతుంటాయి.దెబ్బ తగిలినప్పుడు, ఆరోగ్యం బాగా లేనప్పుడు చెప్పుకోలేవు కానీ అవి పడే బాధ అంతా ఇంతా కాదు.

ఇక ఏదైనా జంతువు చనిపోయినప్పుడు అదే జాతికి చెందిన జంతువు రోదన ఎలా ఉంటుందో వర్ణనాతీతం.

మనుషులైతే వారి బాధను బయటికి చెప్పుకోగలరు, కాని జంతువులు అలా చెప్పలేవు.ఇక తమతోటి జంతువు మరణిస్తే అవి కూడా అచ్చం మనుషుల మాదిరిగానే ఏడుస్తాయి.

ప్రస్తుతం అలాంటి సంఘటన కు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో ఒక కోలా జంతువు( Koala ) చనిపోతే మరోకోలా దానిని పట్టుకొని రోదిస్తుంది.

కేవలం మానవులకే కాకుండా ఈ ప్రపంచంలో ప్రతి జీవికి భావోద్వేగాలుంటాయని ఈ వీడియోని చూస్తే అర్థమవుతుంది.

"""/" / దక్షిణ ఆస్ట్రేలియాకు( South Australia ) చెందిన కోలా రెస్క్యూ గ్రూప్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది.

కోలా అనేవి ఎలుగుబంటిని పోలి ఉండే చిన్న జీవులు.ఈ జంతువులు ఆస్ట్రేలియాలో కనిపిస్తాయి.

అవి పూర్తి శాకాహార జీవులు.తన తోటి కోలాను కోల్పోయిన ఓ కోలా దానిని పట్టుకుని ఏడుస్తున్న వీడియోని చూసిన వారి కంట కన్నీళ్లు తెప్పిస్తోంది.

ఆ వీడియోలో ఓ కోలా చనిపోయిన( Deceased Koala ) ఇంకో కోలాను తన ఒళ్లో పెట్టుకుని హృదయానికి హత్తుకొని కంటతడి పెట్టుకుంటోంది.

"""/" / ఆ దృశ్యం చూసి కన్నీళ్లు పెట్టుకున్న స్థానికులు కోలా రెస్క్యూ టీంకు( Koala Rescue Team ) సమాచారం అందించారు.

వారు కోలాను తమ రక్షణలోకి తీసుకున్నారు.చనిపోయింది ఆడ కోలా అని గుర్తించారు.

మగ కోలాకు ఆరోగ్య పరీక్షలు చేసిన అనంతరం దానిని అడవిలో విడిచిపెట్టారు.ఆడ కోలా మరణానికి గల కారణం ఇంకా తెలియలేదు.

అవినీతి ఆరోపణల కేసు .. సింగపూర్ భారత సంతతి నేత ఈశ్వరన్‌కు జైలుశిక్ష