ఎలాంటివారు రక్తాన్ని దానం చేయకూడదు?
TeluguStop.com
మీ జీవితంలోని ఓ అరగంట మీది కాదు అనుకోని రక్తదానం కోసం కేటాయిస్తే చాలు, ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన వారు అవుతారు.
రక్తదానం వలన మీరు కోల్పోయేది ఏమి ఉండదు.దానం చేసిన రక్తం ఎలాగో మళ్ళీ పుట్టేస్తుంది.
మంచి బరువు, ఆరోగ్యంగా ఉన్న ఏ మనిషి అయిన రక్తాన్ని దానం చేయవచ్చు అని మీకు తెలుసు.
కాని రక్తం దానం ఎవరు చేయకూడదో, ఎలాంటి పరిస్థితుల్లో చేయకూడదో మీకు తెలుసా? తెలుసుకోండి.
* జ్వరం, ఇంకేదైనా ఇన్ఫెక్షన్ ఉన్నవారు రక్తాన్ని అప్పుడే డొనేట్ చేయకూడదు.ఇక జాండిస్, హెపటైటిస్ లాంటివి చూసిన వారు ఓ ఏడాది కాలంపాటు తమ రక్తాన్ని ఇవ్వకపోవడమే మంచిది.
* మీకు కాదు, ఒకవేళ మీ భాగస్వామికి బ్లడ్ క్లాటింగ్ సమస్యలు ఉండి, వారితో శృంగారం గనుక చేసినట్లయితే, కనీసం ఓ సంవత్సరం పాటు వారితో శృంగారం చేయకుండా గడిపితేనే రక్తాన్ని దానం చేయవచ్చు.
* టాటూ వేయిన్చుకున్నవారు, కాస్మోటిక్ సర్జరీలు చేయించుకున్నవారు, నీడిల్స్ ఉపయోగించి పెర్మనెంట్ ట్రీట్ మెంట్ చేయించుకున్నవారు ఓ నాలుగు నెలల పాటు రక్తాన్ని దానం చేయకూడదు.
టాటూ రకరకాల పద్ధతులలో వేస్తారు.నీడిల్స్ తో వేయించుకుంటే మాత్రం కొన్ని నెలలు ఆగండి.
"""/"/
* స్వలింగ సంపర్కులు కూడా రక్తాన్ని దాన్యం చేయకపోవడమే మంచిది.అలాగే స్వలింగ సంపర్కులతో శృంగారించిన స్ట్రెయిట్ పురుషులు/మహిళలు ఏడాది పాటు రక్తాన్ని ఇవ్వకూడదు.
* కొన్నిరకాల మేడిసిన్స్, ఉదాహరణకి ఐసో ట్రయిన్ లాంటివి వాడుతున్నవారు, యాంటి బయోటిక్స్ ఎక్కువ వాడేవారు ఆ మందులు మానేసిన 4-6 నెలల వరకు రక్తాన్ని ఇవ్వకూడదు.
* HIV/HPV ఇంకెలాంటి సుఖవ్యాధులు ఉన్నా, వారు రక్తాన్ని ఇవ్వకూడదు.వారు మరొకరితో శృంగారిస్తేనే ప్రమాదం, అలాంటిది రక్తం ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం.
"""/"/
* హిమోగ్లోబిన్ కౌంట్ 13.0 G/dL కంటే తక్కువ ఉన్న పురుషులు, 12.
5 G/dL కంటే తక్కువ ఉన్న స్త్రీలు రక్తాన్ని ఇవ్వకూడదు.అలాగే పురుషులైనా, స్త్రీలైనా, హిమోగ్లోబిన్ 20.
0 G/dL కంటే ఎక్కువ ఉంటే రక్తాన్ని ఇవ్వకూడదు.* గుండె సంబధిత సమస్యలు ఏవి ఉన్నా, రక్తాన్ని ఇవ్వకూడదు.
సమస్యకి చికిత్స జరిగిన ఆరునెలల దాకా అయినా ఇలాంటి వారు ఆగాల్సిందే.* ఇక చివరగా, సింపుల్ పాయింట్.
16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు రక్తాన్ని ఇవ్వకూడదు.అలాగే అండర్ వెయిట్ ఉన్నవారు కూడా రక్తదానానికి దూరంగా ఉంటేనే మంచిది.
వాళ్లకు క్షమాపణలు చెప్పిన సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజు.. అసలేం జరిగిందంటే?