టీ కాఫీ తో సహా వేసవిలో ఏయే పానీయాలకు దూరంగా ఉండాలో తెలుసా?

ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.భానుడి సెగలకు నిత్యం ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.

వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి చల్లని పానీయాలు పై మక్కువ చూపుతున్నారు.

ఈ నేపథ్యంలోనే వేసవిలో ఎటువంటి పానీయాలకు దూరంగా ఉండాలి.? ఎటువంటి పానీయాలు తీసుకోవాలి.

? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.వేసవికాలంలో ప్రజలు ఎక్కువగా తాగే పానీయాల్లో కూల్ డ్రింక్స్ ముందు వరుసలో ఉంటాయి.

సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు ఫ్రిడ్జ్ మొత్తం కూల్ డ్రింక్స్ తో నింపేస్తూ ఉంటారు.

కానీ కూల్ డ్రింక్స్ లో ఉండే అధిక చక్కెర మరియు కేలరీలు డీహైడ్రేషన్( Dehydration ) బారిన పడేలా చేస్తాయి.

అదే సమయంలో శరీర బరువు సైతం అదుపు తప్పుతుంది.అలాగే వేసవికాలంలో నీరసం నుంచి ఉపశమనం పొందడం కోసం కొందరు ఎనర్జీ డ్రింక్స్ ను తీసుకుంటూ ఉంటారు.

నిజానికి ఎనర్జీ డ్రింక్స్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు.ఎనర్జీ డ్రింక్ లో కెఫిన్, టౌరిన్ షుగర్, స్వీట్న‌ర్స్‌ తో పాటు హానికరమైన పదార్ధాలు ఉంటాయి.

ఇవి శ‌రీరంలోని అవ‌య‌వాల ప‌నితీరును దెబ్బ తీస్తాయి.ఆరోగ్యం మొత్తాన్ని దెబ్బ కొడ‌తాయి.

"""/" / అలాగే వేసవికాలంలో టీ, కాఫీ( Tea, Coffee ) వంటి పానీయాలకు కూడా దూరంగా ఉండాలి.

ఎందుకంటే ఇవి శరీర ఉష్ణోగ్రతను మరింత పెంచుతాయి.సమ్మర్ లో ఎవైడ్ చేయాల్సిన పానీయాల్లో ఆల్కహాల్ ఒకటి.

ఆల్కహాల్ డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది.మరియు ఉష్ణోగ్రతను నియంత్రించే మీ శరీర సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది.

అంతేకాకుండా పాలు మరియు పాల ఆధారిత పానీయాలను కూడా వేసవి కాలంలో తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే వేడి వాతావరణంలో అవి జీర్ణం కావడం కష్టతరంగా ఉంటుంది. """/" / ఇక‌ వేసవికాలంలో ఎటువంటి పానీయాలు తీసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, రాగి జావ, పుచ్చకాయ జ్యూస్, ఆమ్ పన్నా, సత్తు షర్బత్ వంటివి వేసవిలో తీసుకోద‌గ్గ పానీయాలు.

ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి.బాడీకి మంచి కూలింగ్ ఎఫెక్ట్‌ను అందిస్తాయి.

నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకుంటాయి.