మహాలయ అమావాస్య ఎప్పుడు.. ఆ రోజు ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు మహాలయ పక్షం ప్రారంభమవుతుంది.

పౌర్ణమి రోజు మహాలయ పక్షం ప్రారంభం కాగా అమావాస్యతో ముగుస్తుంది.ఈ క్రమంలోనే ఈ 15 రోజులను ఎంతో పవిత్రమైన రోజులుగా పితృ పక్షాలుగా భావిస్తారు.

ఈ పదిహేను రోజులలో చనిపోయిన మన పూర్వీకులకు శ్రాద్ధం పెట్టడానికి ఎంతో అనుకూలమైన రోజులుగా చెప్పవచ్చు.

ఇలా పౌర్ణమి రోజు మొదలైన ఈ పితృ పక్షాలు అమావాస్య రోజున ముగుస్తాయి.

మరి బాద్రపద మహాలయ అమావాస్య ఎప్పుడు వస్తుంది.ఆరోజు ఏ విధమైనటువంటి నియమాలను పాటించాలి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఈ భాద్రపద అమావాస్యను మహాలయ అమావాస్య లేదా సర్వ ప్రీతి అమావాస్య అని కూడా పిలుస్తారు.

పూర్వ కాలం నుంచి ఈ అమావాస్యను రోజును శ్రాద్ధానికి చివరిరోజుగా నమ్ముతారు.ఈ సర్వ పితృ అమావాస్యనాడు మనకు తెలిసిన, తెలియని పూర్వీకుల కోసం శ్రాద్ధం నిర్వహించడం ప్రత్యేకం.

 అయితే చాలా మందికి వారి పూర్వీకులు లేదా పెద్దవారు ఎప్పుడు మరణించారో ఆ తేదీ తెలిసి ఉండదు.

అలాంటి వారు సర్వ ప్రీతి అమావాస్యరోజు వారికి శార్థం పెట్టడం వల్ల వారి ఆత్మకు శాంతి కలుగు తుందని పండితులు చెబుతున్నారు.

"""/" / మన ధర్మం ప్రకారం చనిపోయిన పూర్వీకులు ఈ పితృపక్షంలో భూమి పైకి వస్తారని వారి ఆత్మ సంతృప్తి చెంది తిరిగి స్వర్గలోకానికి వెళ్లాలని పిత్రు పక్షంలో వారికి శ్రాద్ధం పెడతాము.

మరి ఈ ఏడాది అమావాస్య అక్టోబర్ 6వ తేదీ వచ్చింది.ఈరోజు సర్వ పితృ అమావాస్య కు ఎంతో అనువైన రోజు.

పంచాంగం ప్రకారం మహాలయ అమావాస్య అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం 07:04 నుంచి ప్రారంభమై అక్టోబర్ 6వ తేదీ సాయంత్రం 4:35 వరకు ఉంటుంది.

అక్టోబర్ 6వ తేదీ అమావాస్య తిథి సూర్యోదయం కావడం వల్ల సర్వ పిత్రు అమావాస్యను ఆరవ తేదీగా పరిగణిస్తారు.

ఈ రోజు చనిపోయిన వారికి శ్రాద్ధం నిర్వహిస్తే వారి ఆత్మ లకు మోక్షం దక్కుతుంది.

ఈ పదిహేను రోజులు సంతాప దినాలుగా పరిగణిస్తారు కనుక ఇంట్లో ఏ విధమైనటువంటి శుభకార్యాలు, కొత్త వస్తువులు గృహాలు కొనుగోలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.

కాంగ్రెస్ చెప్పేవన్నీ బోగస్ మాటలే..: హరీశ్ రావు