ఈ ఫిష్ కర్రీ మసాలాను వాడే ముందు ఇది తెలుసుకోండి..!

భారతదేశంలో ప్రముఖ బ్రాండెడ్ మసాలాలో ఎవరెస్ట్ మసాలా( Everest Masala ) ఒకటి.

ఇప్పటికే మార్కెట్లో ఈ ఎవరెస్టు బ్రాండ్ పేరుతో ఎన్నో రకాల మసాలాలు అన్నవి వినియోగంలో ఉన్నాయి.

వీటిలో బిర్యానీ మసాలా, వెజిటేబుల్ మసాలా, చికెన్ మసాలా, ఫిష్ మసాలా( Fish Masala ) లాంటి రకరకాల మసాలాలు అందుబాటులో ఉన్నాయి.

అయితే ఒకప్పుడు ఏ కూరల్లో అయినా ఇంట్లో అప్పటికప్పుడు తయారు చేసే మసాలా మిశ్రమాలను వేసుకునేవారు.

కానీ ఇప్పుడు మాత్రం ఇన్స్టెంట్ గా దొరికే ఈ మసాలా పౌడర్లను మాత్రమే వినియోగిస్తున్నారు.

ఈ క్రమంలోనే మార్కెట్లో రకరకాల పేర్లతో ఫుడ్ మసాలా పౌడర్లు అందుబాటులోకి వస్తున్నాయి.

"""/" / మార్కెట్లో ఎన్ని బ్రాండ్ మసాలా పౌడర్లు ఉన్న టేస్ట్ లో ది బెస్ట్ ఎవరెస్ట్ అంటూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు.

అయితే ఎవరెస్ట్ కి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.అయితే భారత్ లో తయారైన ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో పురుగుమందు అవశేషాలు( Pesticide Residues ) అధిక స్థాయిలో ఉన్నాయని సింగపూర్ ఆరోపించింది.

అలాగే ఈ మసాలా మిశ్రమంలో మానవ వినియోగానికి పనికిరాని పురుగుమందు ఇథిలీన్ ఆక్సైడ్ అధిక స్థాయిలో ఉందని గుర్తించారు.

అందులో ఫిష్ మాసాలలో పరిమితులు దాటి ఇథిలిన్ ఆక్సైడ్ ఉందని హైలెట్ చేసింది.

"""/" / అయితే భారత్ లో తయారైన ఎవరెస్టు ఫిష్ కర్రీ మసాలాలో ఇథిలీన్ ఆక్సైడ్ స్థాయిలు నిర్దేశిత పరిమితికి మించి ఉన్నాయని హాంగ్ కాంగ్ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ ( Hong Kong Center For Food Safety )జారీ చేసిన నోటిఫికేషన్ కు ప్రతిస్పందనగా వాటిని వెంటనే రీ కాల్ చేయాలని సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ఓ ప్రకటనలో విడుదల చేసింది.

అలాగే ఉత్పత్తులను వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభించాలని కూడా ఆదేశించింది.అయితే ఇథిలీన్ ఆక్సైడ్ సాధారణంగా వ్యవసాయ ఉత్పత్తులకు సూక్ష్మజీవులు నాశనం చేయకుండా ఉండేందుకు, పురుగుల మందుగా వినియోగిస్తారు.

అయితే ఆహార ఉత్పత్తుల్లో మాత్రం దీని వినియోగం పై నిషేధం విధించారు.

కొబ్బరి పాలు, అవిసె గింజలతో ఇలా చేశారంటే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు!