గుప్పెడు గసగసాల తో ఇన్ని.. ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..?

మనం ఉపయోగించే మసాలా దినుసులలో గసగసాలు( Poppy Seeds ) ముఖ్యమైనవి అని కచ్చితంగా చెప్పవచ్చు.

వీటినే గసాలు అని కూడా అంటారు.ముఖ్యంగా చెప్పాలంటే గసగసాల నుంచి నల్ల మందును కూడా తయారుచేస్తారు.

నల్లమందు ఆరోగ్యానికి హానికరమని దాదాపు చాలా మందికి తెలుసు.వీటిని కేవలం ఔషధంగా అప్పుడప్పుడు ఉపయోగించడం మంచిది.

వీటిని పూర్వం రోజుల నుంచి మన పూర్వీకులు ఔషధాలలో ఉపయోగించేవారు.గసగసాలను వంటల్లో వేయడం వల్ల కమ్మని రుచి వస్తుంది.

మూత్రపిండాల ఆకారంలో ఉండే గసగసాల గురించి ప్రస్తుత సమాజంలో ఉన్న చాలామందికి తెలియదు.

గసగసాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. """/" / వీటిలో క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, జింక్, మాంగనీస్ మరియు ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి.

వీటిలో థయామిన్ మరియు ఫోలేట్ ఎక్కువగా ఉన్నాయి.ఈ గసగసాలలో లినోలెయిక్ ఆమ్లం ఉంటుంది.

అలాగే ఆరోగ్యకరమైన గుండెకు అవసరమైన ఒమేగా 6 కొవ్వు ఆమ్లం( Omega 6 Fatty Acids ) ఇందులో ఉంటుంది.

చిన్నగా ఉండే ఈ గసగసాలలో ఎన్నో వ్యాధులను దూరం చేసే లక్షణాలు ఉన్నాయి.

గసగసాలు నిద్రలేమి సమస్యను దూరం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.గసగసాల ను పేస్టుగా చేసి ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కలపాలి.

ఈ గసగసాల పాలను రాత్రి నిద్రపోయే ముందు సేవిస్తే మంచి నిద్ర పడుతుంది.

"""/" / ఈ విధంగా కొన్ని రోజుల్లో చేస్తూ ఉంటే నిద్రలేమి సమస్య దూరం అయిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

గసగసాలలో అధిక మొత్తంలో ఫైబర్( Fiber ) ఉంటుంది.ఈ ఆరోగ్యకర ఫైబర్ పేగు కదలికలను వేగవంతం చేయడంతో పాటు మలబద్ధకాన్ని కూడా దూరం చేస్తుంది.

అలాగే దగ్గు మరియు దీర్ఘకాలిక ఆస్తమా నుంచి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.కిడ్నీలలో ఏర్పడే రాళ్లు ను( Kidney Stones ) నివారించే శక్తిని గసగసాలకు ఉంది.

అలాగే గుండె సమస్యలు ఉన్నవారు గసగసాలను లైట్ గా ఫ్రై చేసి పంచదార కలిపి ఉదయం సాయంత్రం అర స్పూన్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

కెనడా : నయాగరా జలపాతంలో దూకి భారతీయ విద్యార్ధి ఆత్మహత్య