నలభైల్లో పిల్లలను ప్లాన్ చేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
TeluguStop.com
ఒకప్పుడు అమ్మాయిలకు చాలా చిన్న వయసులోనే వివాహం చేసేవారు.20 ఏళ్లు వచ్చేసరికి పెళ్లై పిల్లలను కూడా కనేసేవారు.
కానీ ఇప్పుడు కాలం మారింది.ఆడవాళ్లు మగవారితో పోటీ పడుతున్నారు.
ఉద్యోగాలు( Jobs ) సంపాదించి తమ కాళ్ళపై తామ నిలబడిన తర్వాతే వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు.
అలాగే ప్రస్తుత రోజుల్లో చాలా మంది వివాహం అయిన వెంటనే పిల్లలను కనేందుకు ఇష్టపడడం లేదు.
కెరీర్, జాబ్ ప్రయారిటీస్, జీవితంలో స్థిరపడటం వంటి అనేక కారణాలతో ప్రెగ్నెన్సీని( Pregnancy ) వాయిదా వేస్తున్నారు.
పైగా ఈ మధ్యంలోనే నలభైల్లో పిల్లలను ప్లాన్( Children In The Forties ) చేసుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
అయితే నలభైల్లో పిల్లలను ప్లాన్ చేసుకుంటున్నవారు తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.మహిళలు 25 నుంచి 35 ఏళ్ల మధ్య పిల్లలను కనేయాలి.
ఇదే పర్ఫెక్ట్ ఏజ్.నలభైల్లో పిల్లలను కనకూడదా అంటే కనొచ్చు.
కానీ వయసులో వచ్చే ప్రెగ్నెన్సీ వల్ల ఇటు తల్లి, అటు బిడ్డ ఇద్దరూ పలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
"""/" /
వాస్తవానికి వయసు పెరిగే కొద్దీ మహిళల్లో అండాల సంఖ్య తగ్గుతూ వస్తుంది.
ఇరవైల్లో ఉన్నప్పుడు లక్షల్లో, ముప్పైల్లో ఉన్నప్పుడు వేళల్లో ఉండే అండాల సంఖ్య నలభైల్లోకి వచ్చేసరికి వందలకు పడిపోతుంది.
అందాల సంఖ్య తగ్గే కొద్దీ గర్భం దాల్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.
పిల్లల్ని కనడానికి అండాల సంఖ్య ఎంత ముఖ్యమో అండాల నాణ్యత కూడా అంతే ముఖ్యం.
ఎందుకంటే అండం నాణ్యత లేకపోతే ఫలదీకరణ చెందినప్పుడు పిల్లల్లో జన్యుపరమైన సమస్యలు తలెత్తుతాయి.
క్రోమోజోమల్ రిస్క్( Chromosomal Risk ) పెరగడం, డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్స్ సిండ్రోమ్ ( Down Syndrome, Edwards Syndrome )ఇందులో భాగమే.
అలాగే తక్కువ బరువుతో పిల్లలు పెట్టడం, నెలలు నిండకుండానే డెలివరీ కావడం, తల్లికి బీపీ షుగర్ ఎటాక్ అవ్వడం వంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
"""/" /
అందుకే నలభైల్లో పిల్లలను ప్లాన్ చేసుకుంటున్న వారు పైన అంశాలను కచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలి.
40ల్లో పిల్లలను కనాలనుకుంటున్నవారు ఎల్లప్పుడూ డాక్టర్ పర్యవేక్షణలో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.అలాగే వారు సూచించిన అన్ని టెస్టులు చేయించుకుంటూ తగిన మందులు వాడాలి.
ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత పిండం ఎదుగుదల ఎలా ఉంది.? జన్యుపరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందా.
? వంటి విషయాలు తెలుసుకోవాలి.ఇందుకోసం కొన్ని జన్యుపరమైన టెస్టులు చేయించుకోవాలి.
అలాగే నలభైల్లో పిల్లలను కనేవారు శారీరకంగా మానసికంగా ఫిట్‌గా ఉండటం కూడా ఎంతో అవసరం.
లేదంటే పిండం ఎదిగే కొద్ది చాలా సమస్యలను ఫేస్ చేస్తారు.
వీడియో: అట్లాంటిక్ మహాసముద్రంలో రాకాసి గాలి.. క్రూయిజ్ షిప్ దాదాపు పడిపోయింది..!!