రావు రమేష్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు…

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు ఒక మూస ధోరణిలో నటిస్తూ ముందుకు వెళ్తూవుంటారు.

నిజానికి వాళ్ళకి ఏ క్యారెక్టర్ లో ఎలా చేయాలి అనే విషయాలు ఏం తెలియవు.

అన్ని సినిమాల్లో పాత్రలతో సంభందం లేకుండా ఒకేరకమైన యాక్టింగ్ చేస్తూ ప్రేక్షకులకు చిరాకు పుట్టిస్తారు.

ఇక ఇలాంటి నటులు ఇండస్ట్రీ లో ఉన్నప్పటికీ కొంత మంది నటులు మాత్రం పాత్ర ల కోసం వాళ్ళ వేషధారణ కూడా మార్చుకొని చాలా కష్టపడుతూ బాగా నటిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు.

వాళ్లు చేసే ప్రతి పాత్రలో కూడా ఒక మార్క్ అనేది వేస్తూ వాళ్ళకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకుంటారు.

అలాంటి వాళ్లలో ముందు వరుస లో ఉండేవారు రావు రమేష్ గారు.( Rao Ramesh ) ఈయన చేసిన ప్రతి సినిమాలో ఎదో ఒక వేరియేషన్ అయితే తప్పకుండ ఉండేలా చూసుకుంటారు.

ప్రతి పాత్ర ఒక డిఫరెంట్ వే లో ఉంటుంది.అందుకే ఆయన యాక్టింగ్ అంటే అందరికి చాలా ఇష్టం.

"""/" / ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సినిమాలో( Seethamma Vakitlo Sirimalle Chettu ) అయన చేసిన పాత్ర కి సెపరేట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు అంటే అతిశ్రేయోక్తి కాదు.

నిజం గా చెప్పాలంటే ఒక పాత్ర చేయాలంటే అయన ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తారు.

వీళ్ల నాన్న రావు గోపాల రావు( Rao Gopala Rao ) కూడా ఒక మంచి నటుడు కావడం తో అయన వారసత్వం గా వచ్చిన నటనని పుణికి పుచ్చుకొని దాన్నే రమేష్ కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు.

"""/" / ఈయన ప్రస్తుతము అందరూ పెద్ద హీరోల సినిమాల్లో కూడా నటిస్తున్నారు.

అన్ని రకాల పాత్రల్లో ఒదిగిపోయి నటించి మెప్పించడం ఆయన నైజం.ఇక ఇది ఇలా ఉంటె డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమాలో మాత్రం ఆయన కోసం సెపరేట్ గా క్యారెక్టర్ డిజైన్ చేస్తాడు హరీష్ శంకర్ ( Harish Shankar ) ఇదంతా మనం ఆయన ప్రీవియస్ సినిమాలు చూస్తుంటే మనకు అర్థం అవుతుంది.

ఆయన చేసిన సినిమాల్లో ఆయనకీ బాగా పేరు తెచ్చిన సినిమాలలో గబ్బర్ సింగ్, సీతమ్మ వాకిట్లో, సుబ్రమణ్యం ఫర్ సెల్, అఆ, డీజే లాంటి సినిమాలు ఉన్నాయి.

బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయిన టేస్టీ తేజ ఎన్ని లక్షలు సంపాదించారో తెలుసా?